Select Location
Newsread Image

No.1 Short News

Umar Fharooq
కార్మిక సోదర సోదరీమణులకు చరిత్రత్మక మేడే శుభాకాంక్షలు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కు చెందిన తూర్పు గంగవరంలో ఈరోజు మే డే సందర్భంగా కార్మిక సోదరులు ర్యాలీ ద్వారా సచివాలయం నకు చేరుకొని కమిటీ హాలును కోరుతూ పంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం అందజేశారు. తదుపరి జెండాను ఆవిష్కరించి కొత్త కమిటీ సభ్యులను ఎన్నుకొని వారి చేత కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ,రాత్రనకా పగలనకా చామటను చిందించి దేశ ఆర్థిక వ్యవస్థకు కార్మికులు ఎంతగానో దోహదపడుతున్నారని,శ్రామిక, కర్షక,కార్మికుల రెక్కల కష్టం వెలకట్టలేనిదని వారు అన్నారు.
View More
Latest News
01 May 2025 17:06 PM
0
3
Newsread Image

No.1 Short News

Newsread
డ్రగ్స్, మత్తుపదార్థాల నివారణ కు అవగాహనే మార్గం -తమీం అన్సారియా
మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గం: జిల్లా క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియా 👉యువత చెడు వ్యాసాలకు దూరంగా ఉండాలి...గంజాయి/ మాదకద్రవ్యాలను దరి చేరనియ్యరాదు:ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ 👉గంజాయిని రవాణా చేసినా, వినియోగించిన చట్టపరంగా కఠిన చర్యలు:జిల్లా ఎస్పీ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మరియు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వారి ఆధ్వర్యం లో జిల్లా స్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. డ్ర‌గ్స్ వినియోగంవ‌ల్ల క‌లిగే దుష్ప‌లితాల‌ను పెద్ద ఎత్తున‌ వివ‌రించ‌డ‌మే కాకుండా, జిల్లాలో పూర్తిస్థాయి నియంత్ర‌ణ‌కు కట్టుదిట్టమైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో డ్ర‌గ్స్‌ను పూర్తి స్థాయిలో నివారించేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని సూచించారు. జిల్లాలో మాద‌క ద్ర‌వ్యాలు, మ‌త్తు ప‌దార్ధాల నివార‌ణ‌కు, ప్ర‌తీఒక్క‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే ఏకైక మార్గ‌మని అందులో భాగంగా ప్ర‌తీ విద్యాసంస్థ‌లో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను విస్తృతం చేయాల‌న్నారు. వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నాటికి అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు విద్యాసంస్థ‌ల్లో ఈగిల్ క్ల‌బ్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. ఔష‌ద నియంత్రాణాధికారులు సంయుక్తంగా మందుల షాపుల‌ను త‌నిఖీ చేయాల‌ని ఆదేశించారు. డ్ర‌గ్స్ వినియోగం, ర‌వాణాపై నిఘాను పెంచి, అరిక‌ట్టేందుకు మ‌రింత స‌మ‌ర్ధ‌వంతంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఏర్పాటు చేసిన 1972 టోల్ ఫ్రీ నెంబ‌ర్ కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌న్నారు. విద్యార్ధుల‌తోపాటుగా వివిధ వ‌ర్గాల్లో విస్తృతంగా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా జిల్లాలో డ్ర‌గ్స్ ర‌వాణాను పూర్తిస్థాయిలో అరిక‌ట్ట‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ, జిల్లాలో మ‌త్తు ప‌దార్ధాలు, మాద‌క ద్ర‌వ్యాలను అరిక‌ట్ట‌డానికి తీసుకున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. జిల్లాలో ఎక్క‌డా గంజాయి పంట‌ సాగు జ‌ర‌గ‌డం లేద‌ని తెలిపారు. జిల్లా మీదుగా ర‌వాణా జ‌రుగుతోంద‌ని, దీనిని అరిక‌ట్టేందుకు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. న‌మోదు చేసిన కేసుల సంఖ్య ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా గంజాయి, డ్రగ్స్ వినియోగం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం కూడా శిక్షార్హమేనని, గంజాయి, డ్రగ్స్ వినియోగం కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాల నుండి మైనింగ్ పనుల కొరకు ఇతర ప్రాంతాల నుండి కూలీలు జిల్లా కు వస్తుంటారని, సంబంధిత పరిశ్రమల యాజమాన్యం వారిని సమన్వయము చేసుకొని కూలీల పై నిఘా ఉండేలా మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ వినియోగం, సరఫరాకు సంబంధించి 283 మందిని గుర్తించడం జరిగిందన్నారు. ఒంగోలు లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, క‌ళాశాల‌ల్లో ఈగిల్ టీమ్‌లు, డ్రాప్ బాక్సుల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. మ‌త్తుప‌దార్ధాల వినియోగాన్ని మాన్పించేందుకు జిల్లాలో డీ అడిక్ష‌న్ సెంట‌ర్‌ను బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల స‌హ‌కారంతోనే పూర్తి స్థాయిలో డ్ర‌గ్స్‌ను అరిక‌ట్ట‌వ‌చ్చున‌ని జిల్లా ఎస్పీ గారు సూచించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లనందు డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. స్కూల్స్, కాలేజ్, హాస్టల్స్, మరియు డాబాలలో, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజ్ లలో బోర్డ్ లు.. మత్తు పదార్థాల నివారించే చర్యలపై పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణ పై రూపొందించిన బ్రోచర్ల ను ఆవిష్కరించారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అమ్మకం ,రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు లేదా పోలీస్ డయల్ 100/112 తెలియజేయాలని, అట్టివారు వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. అనంతరం ముఖ్యంగా పాఠశాలలు/కళాశాలలో విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలియచేయాలని,స్వీయ రక్షణ, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసలపట్ల మరియు చట్టాలపై, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలు/మహిళలు/యువత ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి కూడా అవగాహన కల్పించాలని, MEO, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించాలన్నారు. పిల్లలపై నేరాలకు సంబంధించిన సమాచారం వెంటనే పోలీస్ వారికి తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వర రావు, మార్కాపురం సబ్ కలెక్టర్ శ్రీ సహదీత్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ చిన ఓబులేసు, ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఆర్ డి ఓ లక్ష్మీ ప్రసన్న, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డా ఏడుకొండలు, డిడి సోషల్ వెల్ఫేర్ శ్రీ లక్ష్మా నాయక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
30 Apr 2025 21:53 PM
1
14
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
75 % హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపు..
ఏపీలో తల్లికి వందనం పథకంపై బిగ్ అప్డేట్. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.15000 ఒకేసారి ఇవ్వాలా లేదా రూ. 7500 చొప్పున రెండు సార్లు జమ చేయాలా అనే దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది. కాగా 75 శాతం హాజరు ఉంటేనే తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
22
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ..
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామం. సమీపంలో టైర్ పేలి స్తంభాన్ని ఢీ కొట్టి బోల్తాపడ్డ లారీ ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు, క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వం వైద్యశాలకు తరలింపు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
15
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
పాకిస్తాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: SP
గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లాలో పాకిస్తాన్ వీసాలతో ఉన్న పాకిస్తాన్ పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
14
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రివర్యులు శిద్దా రాఘవరావు..
శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి వర్యులు శిద్దా రాఘవరావు మరియు కుటుంబ సభ్యులు తదనంతరం ఆలయ EO శ్రీనివాసరావు స్వామి చిత్రపటాన్ని మరియు ప్రసాదాలు అందించి శిద్దా రాఘవరావుకి ఆశీర్వాదాలు అందజేశారు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
0
14
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
దరిశి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం..
వేసవి విజ్ఞాన శిబిరమును దర్శి శాఖ గ్రంధాలయంలో సోమవారం దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకర్ల రఘురామయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి -1 కె.రఘురామయ్య ఎంఈఓ -2 ఏ రమాదేవి,బీడీసీఎల్ నిర్వాహకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. రఘురామయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు వాటి వలన ఉపయోగాలు చెప్పారు. వేసవిలో చక్కగా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థులకువివరించడం జరిగినది. ఎంఈఓ రమాదేవి మాట్లాడుతూ చక్కటి గ్రంథాలయాలను ఉపయోగించుకొని మంచి మంచి కథలు చెప్పటం, చెప్పించడం చాలా ఉపయోగమని తెలియచేశారు. మేము కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకొని ఒక స్థాయిలో ఉండగలిగామని వారు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన గ్రంథపాలకురాలు విజయ కుమారికు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బీడీసీఎల్ నిర్వహకులు బి కోటయ్య, బి చెంచులింగం, భూషణ్ రావు, బి గోపి మరియు టీచర్ ఆదిలక్ష్మి పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
View More
Latest News
28 Apr 2025 16:33 PM
1
13
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
తిరుపతి లో 10 లక్షల to 150 సోలార్ కెమెరాల ఏర్పాటు: హర్షవర్ధన్ IPS
తిరుపతి: శాంతి, భద్రతల దృష్ట్యా తిరుపతి నగరంతోపాటు జిల్లా లో వివిధ ప్రదేశాలలో అమర్చేందుకు 10 లక్షల విలువైన 150 సోలార్ కెమెరాలను కొనుగోలు చేశామని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ అన్నారు.తిరుపతిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు ‌చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ మీడియా తో మాట్లాడారు. సోలార్ కెమెరాలు సౌర శక్తితో పనిచేస్తాయని, ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు చాలా అడ్వాన్స్ ఫీచర్స్ కలిగి ఆడియో మరియు వీడియో ఉంటుందన్నారు. సోలార్ కెమెరాలు విద్యుత్ అంతరాయం ఉండదన్నారు. సౌర శక్తితో పని చేస్తాయని, విద్యుత్తు లేని ప్రాంతాల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యంగా ఉంటుంది. వైర్లెస్ కనెక్టివిటీతో ఉంటుందని, స్మార్ట్ ఫోనులో మనం ఎక్కడ ఉన్న పర్యవేక్షించవచ్చున్నారు.ఇది మొబైల్ సిమ్ కార్డు ఆధారంగా పనిచేస్తుందన్నారు. ప్రధానంగా తిరుమలలో శాంతిభద్రతల దృష్ట్యా 20 సోలార్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నమన్నారు. అంతేకాకుండా తిరుపతి, చంద్రగిరి ఇతర ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సోలార్ సిసి కెమెరా అమర్చేందుకు ఎర్పాట్లు చేస్తున్నమన్నారు. ఇప్పటికే జిల్లా లోని వివిధ ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు.సోలార్ కెమెరాలు అమర్చడం ద్వారా కొంతవరకు అకతాయల, అల్లరి మూకలకు చెక్ పెట్టవచ్చన్నారు.గరుడ వారిది పై బ్లాక్ స్పాట్స్ గుర్తించి సోలార్ సిసి కెమెరాను ఏర్పాటు చేస్తాము. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సోలార్ సిసి కెమెరాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో పూర్తి స్థాయి లో సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. పోలీసు సిబ్బంది వెళ్లని ప్రదేశం కూడా డ్రోన్ కెమెరాతో వెళ్ళి గాలిస్తున్నాం. ఇలా చేయడం ద్వారా మెన్ పవర్ సేవ్ అవుతుంది. డ్రోన్ కెమెరాలతో గడిచిన కాలంలో గంజాయి స్ధావరాలతో పాటు నాటుసారాయి స్ధావరాలపై దాడులు చేసి కొంత మందిని అరెస్ట్ చేశామన్నారు. హోం స్టే కు సంబంధించిన లిస్ట్ మా వద్ద ఉంది. ప్రతి రోజు హోం స్టేలను మా సిబ్బంది చెక్ చేస్తున్నాము. హోం స్టే లో ఎదైన వివాదాలు జరిగితే అలాంటి వాటి పై యాక్షన్ సిరియస్ గా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమంలో శ్రీ కె. రావిమనోహరచారి అదనపు ఎస్పీ, శ్రీ. సాదిక్ ఆలీ సీఐ ఎస్బి, శ్రీ వినోద్ కుమార్ సీ.ఐ. సైబర్ క్రైమ్స్,శ్రీ ఈశ్వర్ సీఐ కమాండ్ కంట్రోల్ శ్రీ రమణారెడ్డి ఆర్ఐ లు పాల్గొన్నారు.
View More
Latest News
28 Apr 2025 16:32 PM
0
13
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
నేర నియంత్రణకు నిరంతర నిఘా నిర్వహిస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఐ.పి.యస్., ఆదేశాలమేరకు పోలీసులు రాత్రిపూట నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ పహారా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని వేలిముద్ర ఆధారంగా విచారిస్తూ Night patrol విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎటువంటి నేరాలు జరుగకుండా పోలీసుల తనిఖీలు మరియు అనుమానితులను విచారించడం మరియు గస్తీ తిరగడం వంటివి నిరంతరం చేస్తున్నారు.
View More
Latest News
28 Apr 2025 12:28 PM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
శివరాజ్ నగర్: కార్యకర్త ను పరామర్శించిన ఎమ్మెల్యే బూచేపల్లి
దర్శి నియోజకవర్గం దర్శి నగర పంచాయతీ లోని శివరాజ్ నగర్ నందు వైఎస్ఆర్ సీపీ పార్టీ నాయకుడు మస్తాన్ వలి కుమారుడు ఇటీవల రోడ్ ప్రమాదం లో గాయపడగా దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వెళ్ళి పరామర్శించారు.
View More
Latest News
28 Apr 2025 12:02 PM
2
15
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ : మద్యం మత్తులో ఆకతాయి బీభత్సం
బీర్కూర్ మండల కేంద్రం లో hp పెట్రోల్ బాంక్ వద్ద కలిక్ అనే యువకుడు తాగిన మైకం ఆదివారం రాత్రి 9.30 నిమిషలకు లో ఆగి వున్న కారు అద్దం పగలగొట్టి తలము తీసుకోని పారిపోయాడు బీర్కూర్ ps లో కేసు పెట్టటం జరిగింది సదరు వ్యక్తి పైన ps లో రెండు సార్లు ఆఖతాయి పనులు చేస్తున్నాడు అని కేసు లు నమోదు అయినాయి బీర్కూర్ మండలం కేంద్రం లో మత్తు కు బానిస అయి ఇలాంటి ఆకాతాయి పనులు జరుగుతున్నాయి దీనిపైన అధికారులు స్పందించి చర్యలు తీసుకోనగలరు బీర్కూర్ మండలం కేంద్రం లో HP పెట్రోల్ బాంక్ పరిసరాల లో మత్తు పదార్ధాలు విక్రయము జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
View More
Latest News
28 Apr 2025 08:51 AM
0
18
Newsread Image

No.1 Short News

Newsread
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ ను ప్రభుత్వం నియమించింది. ఆదివారం రోజు తెలంగాణ ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా సంగీత సత్యనారాయణ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా పనిచేస్తున్న కర్ణన్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. గత కొంతకాలంగా ఆర్ వి కర్ణ న్ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ గా పనిచేస్తున్నారు.
View More
Latest News
28 Apr 2025 00:30 AM
2
26
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు గైని సాయి కిరణ్మయి
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బీర్కూర్ గ్రామానికి చెందిన గైని క్యాకయ్య &హారతి గార్ల కుమార్తె అయినటువంటి గైని సాయి కిరణ్మయి అనే విద్యార్థిని కి ఇంటర్ లో రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 928 మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించి, నగదు బహుమతి ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 18:10 PM
0
20
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు బర్వేల్లి మానస
కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం బీర్కూర్ గ్రామానికి చెందిన బర్వెల్లి దత్తు, అంజవ్వ గార్ల చిన్న కుమార్తె అయినటువంటి బర్వేల్లి మానస అనే విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాల బీర్కూరులో చదివి రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 929 మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించి, నగదు బహుమతి ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 14:49 PM
2
25
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బిచ్కుంద: ఇంటర్ లో మెరిసిన సావిత్రిభాయి ఫూలే వారసురాలు గంధం తేజశ్రీ
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజీద్ నగర్ గ్రామానికి చెందిన గంధం సాయిలు, పోషవ్వ గార్ల కుమార్తె అయినటువంటి గంధం తేజశ్రీ అనే విద్యార్థి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల కొయ్యగుట్ట (తాడ్కోల్) లో చదివి రాష్ట్రస్థాయి మార్కులైనటువంటి 984/1000మార్కులు సాధించినందుకుగాను బహుజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆ విద్యార్థిని సన్మానించి చిరు జ్ఞాపికను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుజన ఉద్యోగుల సంఘం బాధ్యులైనటువంటి క్యాకయ్య సార్ గారు, దండు సాయిలు సార్ గారు,మహేష్ సార్,సతీష్ సార్, సుధాకర్ సార్, రాచయ్య సార్, పీరయ్య సార్ పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 14:47 PM
0
21
Newsread Image

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బహిరంగంగా సభకు బయల్దేరిన మల్లాపూర్ బీ ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు
బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామాలో ఈరోజు భారతరాష్ట్రసమితి వరంగల్ లో నిర్వహిస్తున్న భారీబహిరంగ సభకు మండలంలోని వివిధ గ్రామాలనుండి వందలాది మందికార్యకర్తలు తాము స్వంతంగా ఏర్పాటు చేసుకున్న వాహనాలలో తరలివెళ్లారు. ముందుగా గ్రామాలలోభారీ ర్యాలీ లు నిర్వహించి అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించి ఛలో వరంగల్, జై కె సి ఆర్ అంటూ నినాదాలు చేసుకుంటూ తరలివెళ్లారు. ఈకార్యక్రమంలో తెరాస పార్టీ బీర్కూర్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ నీరడి శ్రీనివాస్ మల్లాపూర్ యూత్ అధ్యక్షులు రవికాంత్ఉపాధ్యక్షులు బాలాజీ అరుణ్, అంజయ్య, రాజు, శ్రీను, కొల్లి సాయిలు,పోచయ్య,పాల్గొన్నారు
View More
Latest News
27 Apr 2025 13:26 PM
0
21
Newsread Image

No.1 Short News

Newsread
పాకిస్థానీయులు తక్షణమే వెళ్లిపోవాలి: ఏపీ ప్రభుత్వం
ఏపీలో ఉన్న 21 మంది పాకిస్థానీయులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది. వీరిలో ఆరుగురు మెడికల్ వీసా హోల్డర్లు కాగా వారికి 2 రోజులు గడువు విధించింది. అటు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో ఆలయాల పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి గృహాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు
View More
Latest News
27 Apr 2025 13:09 PM
1
21
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
కాశ్మీర్ ఉగ్రదాడితో మరోసారి తెరపైకి వచ్చిన బాబా వంగా జ్యోతిష్యం
పహల్గామ్ దాడి తర్వాత బాబా వాంగ జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది..2025 నుంచి ఒక పెద్ద సంఘర్షణ ప్రారంభమవుతుందని.. అది వినాశనానికి దారితీస్తుందని ఆమె అంచనా వేశారు. అయితే.. పహల్గామ్ మారణహోమం దృష్ట్యా, పెరుగుతున్న ఘోరాలు గురించి ఆమె ముందే హెచ్చరించడం.. అలాగే ప్రస్తుత సంఘటన తీరును పరిశీలిస్తే..ఇక ప్రపంచ స్థాయి లో పరిస్థితులు మారిపోవచ్చు అనే వాదన వినిపిస్తుంది.
View More
Latest News
27 Apr 2025 12:02 PM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: తెలుగుదేశం పార్టీ వార్డు నూతన వార్డు కమిటీ నియామకం
తెలుగుదేశం పార్టీ. నూతన కమిటీలు ఏర్పాట్లు భాగంగా దర్శి వార్డు కమిటీలు నియమించడం జరిగింది . ఈరోజు కొన్ని వార్డు వార్డులు. అధ్యక్షులు. డాక్టర్ టిడిపి నాయకులు కడియాల లలిత్ సాగర్ గారు అభినందించడం జరిగింది. సందు జనార్ధన్, సందు కొండలు, జిసి అనిల్, కూటాల శ్రీను, నీలి శెట్టి నారాయణ, పాశం శ్రీను, నారప శెట్టి శ్రీనివాసులు, కోరి లక్ష్మీనారాయణ, పటాన్ సుభాన్, చిరుకోటి నరేష్, ఆవుల రమణారెడ్డి,నేలకుర్తి మాలాద్రి, పుప్పాల సురేష్, సారెడ్డి శ్రీనివాసరెడ్డి, దొంత శ్రీను, జెమినీ నాగేశ్వరరావు.
View More
Latest News
27 Apr 2025 11:17 AM
0
17
Newsread Image

No.1 Short News

Newsread
టూరిస్టులపై దాడి పిరికిపంద చర్య: కైపు కృష్ణారెడ్డి
టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడి పిరికి పంద చర్య అని కైపు వెంకటకృష్ణా రెడ్డి విమర్శించారు. స్థానిక గడియారం స్తంభం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దాడిలో 26 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయ పడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దాడిలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కేంద్ర, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దుర్ఘటన దేశంలో శాంతి భద్రతల వైపల్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు గాలికొదిలేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చే పనిలో హెూం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నార ని విమర్శించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హెూంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.
View More
Latest News
27 Apr 2025 10:17 AM
1
17

No.1 Short News

PRASANNA ADN NEWS TV
విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి.. : మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని RMS ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6 వ వార్షికోత్సవములో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లితండ్రుల ను ఉద్దేశించి మాట్లాడుతూ వెనుకబడిన మార్కాపురంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి విద్యార్థులనకు మంచి ఇంగ్లీష్ విద్యను అందించడం అభినందనీయమని అన్నారు.మార్కాపురం పట్టణం ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నదని ఇప్పుడు కాలనీలలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టటం జరిగిందని ఒకప్పుడు త్రాగునీటికి కూడా ఇబ్బంది పడ్డ మార్కాపురం పట్టణం నేడు పట్టణo నకు త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ప్రాంతం నుండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లోలు విద్యార్థులు సాధించడం ఆరుదని ఇప్పటినుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి ప్రణాళికతో చదివి దానిని సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..
View More
Latest News
27 Apr 2025 10:11 AM
0
15
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం: జిల్లాలో అడుగడుగునా పోలీసుల విస్తృత తనిఖీలు
లాడ్జిలు, హోటల్, వాహనాలు మరియు పలు ప్రదేశాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు లాడ్జి, హోటల్స్ అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరండి. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపియస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి,డార్మిటరీస్, హోటల్,వాహనాలను మరియు పలు ప్రదేశలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని లాడ్జీల్లో పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయటం నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పలు ప్రదేశాలను డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూనే హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్ తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై ఎం.వి చట్టంప్రకారం చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణా జరగకుండా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
View More
Latest News
26 Apr 2025 21:54 PM
1
19
Newsread Image

No.1 Short News

Newsread
ఇక బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు!గతంలో ఒక్క నమినీకే అవకాశం
▪️మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా ఖాతాలకు ముగ్గురు నామినీలు. ▪️ఒకరి తర్వాత ఒకరిని హక్కుదారులుగా సూచించవచ్చు. ▪️ఖాతాలోని ఆస్తిని శాతాల వారీగా కేటాయించవచ్చు. ▪️బ్యాంకింగ్ చట్టాల బిల్లు సవరణతో అవకాశం. బ్యాంకు ఖాతాదారులు నలుగురిని నామినీలుగా నియమించుకునే అవకాశం రానుంది. బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్యను తగ్గించడం కోసం కేంద్రం ఈ మార్పు తీసుకొస్తోంది. ఇందుకోసం ఇటీవలే బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లును పార్లమెంటు ఆమోదించింది. నాలుగు రోజుల క్రితమే ఈ సవరణపై నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా నామినేషన్ నియమాలలో త్వరలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. గతంలో బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీని మాత్రమే పేర్కొనే అవకాశం ఉండేది. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు చాలాకాలం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. నామినీ మరణించినా అతని ఖాతాలోని ఆస్తులు వారసులకు బదిలీ కాకపోవడంతో పాటు రెండో నామినీ లేకపోవడం వల్ల చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి పదేళ్ల తర్వాత ఖాతాలోని ఆస్తులు ఎవరికీ క్లెయిమ్ చేయకపోవడం వల్ల డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్నెస్ ఫండ్ కి అవి జమ అయిపోతున్నాయి. ఖాతాదారుకి రెండు ఆప్షన్లు నలుగురు నామినీల్లో ఎవరిని హక్కుదారుగా నిర్ణయించాలనేది బ్యాంకు ఖాతాదారు ఇష్టం. దీనికోసం రెండు ఆప్షన్లను కేంద్రం ప్రతిపాదించింది. మొదటి ఆప్షన్ లో ఓ ఖాతాదారుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉంటే అందరినీ నామినీలుగా పెట్టుకుని ఒకరి మరణానంతరం మరొకరిని హక్కుదారుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు తొలుత భార్య ఆమె మరణానంతరం కుమారుడు, అతని మరణానంతరం కుమార్తెలను హక్కుదారులుగా సూచించవచ్చు. రెండో ఆప్షన్ లో తన ఖాతాలోని ఆస్తిని శాతాలవారీగా నలుగురికీ కేటాయించవచ్చు. ఈ మార్పు అన్ని ఖాతాలకు (మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా, బ్యాంక్) వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాకు మాత్రమే నలుగురు నామినీలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్, బీమా వంటి వాటికి ముగ్గురు నామినీలను నియమించే అవకాశం మాత్రమే ఉంది.
View More
Latest News
26 Apr 2025 19:37 PM
1
30
Newsread Image

No.1 Short News

Newsread
న్యూస్ రీడ్: ప్రజల వద్దకే ముఖ్యమంత్రి..
ఎచ్చెర్ల నియోజకవర్గం, బుడగట్లపాలెం సముద్ర తీరంలో మత్స్యకార కుటుంబం అయిన మద్దు పోలేష్, రామలక్ష్మిలతో మాట్లాడి, వారి జీవన విధానం, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ప్రకటన: న్యూస్ రీడ్ లో మీ వార్తల కోసం 9948680044 నెంబర్ కి వాట్సాప్ చేయగలరు.
View More
Latest News
26 Apr 2025 19:15 PM
0
16
Newsread Image

No.1 Short News

Newsread
వక్ఫ్ నిరసన కరపత్రాన్ని ఆవిష్కరించిన అబ్దుల్ సత్తార్
ఒంగోలులో సోమవారం ఉదయం కర్నూలు రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి కలెక్టరు కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ జమియతే ఉలేమా, ఒంగోలు JAC, ఆల్ పార్టీ, ఆల్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరుగుతుంది, ప్రతీ మసీదునుండి ప్రతీ వార్డు నుండీ స్వచ్ఛందంగా పాల్గొని వక్ఫ్ వ్యతిరేకతను భారీ స్థాయిలో తెలియపరచుదాం, Sdpi పార్టీ సభ్యులు, బ్రాంచ్ కమిటీ సభ్యులు r, అసెంబ్లీ సభ్యులు, ప్రతి ఒక్కరూ హాజరు కావాలి, మన గళాన్ని వినిపించాలి, JAC కమిటీ వారి నినాదాల ప్రకారం మనమంతా క్రమశిక్షణతోమేలగాలని అబ్దుల్ సత్తార్ కోరారు.
View More
Latest News
26 Apr 2025 19:08 PM
0
16
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు సెలవు.. కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..
న్యూ ఢిల్లీ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకని తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు.. మే నెల 14వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల బంకుల యజమానులు సంఘం తెలియజేసింది.పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు..
View More
Latest News
26 Apr 2025 18:56 PM
2
18
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
నర్సింగ్ సేవల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గత ఆరు దశాబ్దాల్లో (ఉమ్మడి రాష్ట్రంతో కలిపి) మొట్టమొదటి సారిగా ఫ్లోరెస్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతూ నర్సింగ్ సేవలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవల్ని అందించిన వారికి ఫ్లోరెస్స్ నైటింగేల్ అవార్డులు-2025 ప్రదానం చేయనుంది. నాలుగు కేటగిరీలు..నర్స్ అడ్మి నిస్ట్రేటర్, నర్స్ ఎడ్యుకేటర్, నర్స్ రిసెర్చెర్ నర్సింగ్ సర్వీసెస్(ANMలు, స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు) లకు ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే ఆసుపత్రులు, PHC, CHC, ESI, నర్సులు ఈ అవార్డులకు దరఖాస్తులు చేయవచ్చు. అవార్డు వివరాలు 25,000 /- నగదు, నర్సింగ్ కౌన్సిల్ షీల్డ్ ఇస్తారు. ఆరోజు TA/DA లు ఇస్తారు. అవార్డు ఎంపిక కమిటీ: ▪️వైద్య ఆరోగ్య శాఖ హెచ్.ఓ.డి లు ▪️డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ ▪️రిజిస్ట్రార్, నర్సింగ్ కౌన్సిల్ ▪️సీనియర్ ప్రిన్సిపల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ విద్యాసంస్థలు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాల పూర్తి సమాచారం కొరకు https://hmis.ap.nic.in/ వెబ్ సైట్ చూడండి. దరఖాస్తులు పంపవలసిన చిరునామా: ఈమేరకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రత్యక్షంగా గానీ లేదా పోస్టు, కొరియర్ ద్వారా.. The Registrar, AP Nurses & Midwives Council, Government General Hospital (old) Campus, Olo Director of Medical Education Hanumanpet, Vijayawada- 520002, Amaravathi, AP.
View More
Latest News
26 Apr 2025 18:56 PM
0
14
Newsread Image

No.1 Short News

Umar Fharooq
మే 2న అమరావతికి ప్రధాని మోదీ
మే 2న అమరావతి పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీను ఆహ్వానించిన సీఎం చంద్రబాబు.
Latest News
26 Apr 2025 18:10 PM
0
14
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
సిబ్బందిని పరిగెత్తిస్తున్న కమీషనర్.. పారిశుద్యం పై ప్రత్యేక దృష్టి..
ప్రకాశంజిల్లా పొదిలి నూతన నగరపంచాయితీ కమీషనర్ నారాయణరెడ్డి సిబ్బందిని పరిగెత్తి స్తున్నారు.ప్రతిరొజు తెల్లవారుజామున వీది వీది తిరుగుతు మురుగుకాల్వల లోపాలను తెలుసుకుంటు సిబ్బందిని దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.కొన్నిచొట్ల మురుగుకాల్వలపై ఉన్న బంకులను,ఆక్రమణల ను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు..ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని మురుగు కాల్వల అవతలే వ్యాపారాలు నిర్వహించు కొనాలని సూచన..చెత్తను రోడ్లమీద,కాలువలలో వేయకుండా తప్పనిసరిగా డస్ట్ బిన్లు ఉపయెగించుకొవాలని ప్రజలకు సూచన..పొదిలి అభివృద్ధికి ప్రజల సహకారం తప్పనిసరి ప్రజలలో శానిటేషన్ ఆవగాహన పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.స్దానిక అమ్మవారిశాల,ఆంద్రాబ్యాంక్ వీదిని సందర్శించి సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు..
View More
Latest News
26 Apr 2025 18:10 PM
0
15
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిన యరగూటి నిత్యను సన్మానించిన దర్శి MRO
ఈ రోజు దరిశి స్థానిక తహశిల్దారు కార్యాలయంలో, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. పదోతరగతి ఫలితాలలో ప్రకాశం జిల్లాలో మొదటి స్థానం 600 మార్కులకు గాను 598 పశ్చిమ ప్రకాశానికి రాగా, 600 మార్కులకు 597మార్కులు సాధించి ఒకే ఒక్క మార్కు తేడాతో దరశి ప్రాంతానికి చెందిన ఆణిముత్యం యరగూటి నిత్య జిల్లాలో ద్వితీయ స్థానాన్ని సొంతం చేసికొన్న శుభ సందర్భంగా దరిశి మండల తహశిల్దారు మరియు మండల ఎగ్జికూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్,కపురం శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా దుశ్శాలువాతో,పూల బొకేలతో నిత్యను ఘనంగా సత్కరించి స్వీట్లు పంచుకొని,మధురానుభూతులు పొందారు.ఈ సందర్భంగా తహశిల్దారు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి శుభసందర్భాలు జీవితంలో చాలా రావాలని నిత్య ను కొనియాడి మనసారా దీవించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ.. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన నిత్య నిరుపేద విద్యార్థులందరికీ ఆదర్శవంతంగా వుండాలని దీవించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నిత్య తండ్రి రాజశేఖరరెడ్డి, రెవెన్యూసిబ్బంది పాల్గొన్నారు..
View More
Latest News
26 Apr 2025 18:10 PM
2
27
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
పాక్‌కు వత్తాసు పలికిన MLA అరెస్ట్.. దేశద్రోహం కేసు నమోదు
పహల్గాంలో ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయితే, అస్సాంలోని మంకాచార్ నియోజకవర్గానికి చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం.. పహల్గాం ఘటనలో పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లు ఆరోపణలున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాలతో ఎమ్మెల్యేని అరెస్టు చేసి, దేశద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
View More
Latest News
26 Apr 2025 18:10 PM
0
13
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
నేడు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గంలోని గ్రామాల పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దు..
తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులకు కార్యకర్తలకు విన్నపం మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి శనివారం దర్శి నియోజకవర్గంలోని, తానంచింతల, చలివేంద్రం, ఎర్రఓబనపల్లి గ్రామాల పర్యటన అనివార్య కారణాలవల్ల రద్దయిందని తెలియజేస్తున్నాము గమనించగలరు..
View More
Latest News
26 Apr 2025 18:10 PM
1
11
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
దళిత,గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష..
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నందు సబ్ రిజిస్టర్ అవినీతి,అరాచకాలపై సోమవారం 28/04/2025 వ తేదీ న జరిగే రిలే నిరాహార దీక్షకు దళిత, గిరిజన,ప్రజాసంఘాల నాయకులు అలాగే సబ్ రిజిస్టర్ బాధిత ప్రజలు కులాలకు,మతాలకు, పార్టీలకు,అతీతంగా హాజరై సబ్ రిజిస్టర్ అవినీతి ని ఎండగట్టి ప్రజల పక్షాన పోరాటం చెయ్యబోయే ఈ మహా యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం..
View More
Latest News
26 Apr 2025 18:09 PM
0
12
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
వారం రోజులు ఎండలు, వడగాలులు.. బయటికెళ్లొద్దు..
తెలుగు రాష్ట్రాల్లో 40-44 డిగ్రీల ఎండలు, వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు. TGలో 2 రోజులు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని IMD వెల్లడించింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో 4 మండలాల్లో తీవ్ర వడగాలులు, 17 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. మధ్యాహ్నం వేళ్లలో బయటికి వెళ్లకపోవడం మంచిది..
View More
Latest News
26 Apr 2025 18:09 PM
0
9
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతవరం నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ..
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతవరం నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాఠశాలలో మొదటి మూడు స్థానాల్లో సాధించిన విద్యార్థులకు పోతవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ కోరే బాల రంగ సాయి గారు ఏడువేల రూపాయలు నగదు బహుమతుల్ని అందించారు. వీరిలో గురు ప్రసన్న నియోజకవర్గస్థాయిలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు 586 మార్కులు సాధించింది. ప్రదీప్ 547 మార్కులు, తోక రామలక్ష్మి 541 మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్రా వెంకటేశ్వర్లు గారు, పోతవరం ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ధనిరెడ్డి వెంకటరెడ్డి గారు (UTF సీనియర్ నాయకులు )పాఠశాల ఉపాధ్యాయులు టి. విజయ భాస్కర్ రెడ్డి, ఐ వి ఎల్ నారాయణ, వై జి లివింగ్స్టన్, వివిఎస్ శాస్త్రి, టి.బాలసుబ్బయ్య, డి.మాన్ సింగ్, జి.శిల్పకుమారి, జి సుధారాణి, ఎ. ఖాశీం పాల్గొని విద్యార్థులని అభినందించారు..
View More
Latest News
26 Apr 2025 18:09 PM
1
12
Newsread Image

No.1 Short News

PRASANNA ADN NEWS TV
జమ్మూకాశ్మీర్ ఫహల్గాం లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దర్శి పట్టణంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ
జమ్మూకాశ్మీర్ ఫహల్గాం లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ దర్శి పట్టణంలో ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన ర్యాలీ..
Latest News
26 Apr 2025 13:32 PM
0
19
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి అశ్రునివాళి
పహల్గాం ఉగ్రదాడి ఘటనపై యావత్‌ భారత జాతి రగిలిపోతోంది. ఉగ్రవాదులను, వారిని ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఇటువంటి పరిస్తులు పునారావతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ.ఈ రోజు 6 గంటలకు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దర్శిలోని పొదిలి రోడ్డు నుంచి గడియార స్తంభం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
View More
Latest News
26 Apr 2025 13:02 PM
0
17
Newsread Image

No.1 Short News

Umar Fharooq
పహల్గాం ఉగ్రవాద దాడులలో మరణించిన వారికి నివాళులు
పహల్గాం ఉగ్రవాద దాడులలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తూ విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వైఎస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ, ఈ దాడి మన దేశం మీద జరిగిన దాడి, ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోధాలు ఎంతో బాధను కలిగిస్తున్నాయని, ఈ ఘటనకు భద్రత వైఫల్యమే కారణమని, బిజెపి ఈ విషయాన్ని తప్పు దోవ పట్టిస్తుంది ఒక మతం మీద జరిగిన దాడిగా క్రియేట్ చేస్తుంది.అంతే కాకుండా దాన్ని అనుబంధ సంస్థ అయినా RSS కూడా ఇదే పనిలో ఉందని ఇది చాలా బాధాకరమైన విషయం అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైయస్ షర్మిల అన్నారు.
View More
Latest News
26 Apr 2025 12:24 PM
0
18

No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
బీర్కూర్ లో పహాగ్ గాం మృతులకు క్రోవత్తులతో నివాళులు
పహాల్గం ఉగ్రదాడి ని ఖండిస్తూ మృతులకు నివాళిగా బిర్కుర్ లో బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది కాశ్మీర్ అందాలను అశ్వదించేందుకు వెళ్లిన అమాయక ప్రజల పై దాడి చేయడం బాధాకరం అలాగే కులం అడుగకుండ మతం చూసి నువు హిందువు అయితే చాలు అని చూసి చంపడం బాధాకరం ఈ కార్యక్రమంలో ,పార్టీల కు అతీతంగా గ్రామ పెద్దలు గ్రామ యువత పాల్గొన్నారు. News Read Birkur Reporter : Sai Raja
View More
Latest News
25 Apr 2025 20:49 PM
2
21
Newsread Image

No.1 Short News

Umar Fharooq
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం
73వ ఆర్టికల్ ద్వారా పంచాయితీలకు సర్వాధికారాలు వచ్చాయి దీంతో పంచాయితీలు ఎంతగానో అభివృద్ధి చెందాయి.అయితే ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీడీఓ దార హనుమంతరావు, డిప్యూటీ ఎంపీడీఓ సుందర రామయ్యల ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
View More
Latest News
25 Apr 2025 20:44 PM
0
19
Newsread Image

No.1 Short News

Umar Fharooq
ఉత్తమ సర్పంచ్ గా పోశం సుమలత
ప్రకాశం జిల్లా,తాళ్లూరు మండలంలోని బెల్లంకొండ వారి పాలెం సర్పంచ్ పోశం సుమలత ఉత్తమ సర్పంచ్ గా ఎంపిక కాగా, జాతీయ పంచాయితీ రాజ్ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకోవడం జరిగింది. గ్రామాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతగానో కృషి చేసినందుకు గాను ఉత్తమ సర్పంచ్ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు అభినందించడం జరిగింది.
View More
Latest News
25 Apr 2025 20:43 PM
0
19
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
జన రంజక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం - డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దొనకొండ మండలం, దొండపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ పట్టాభి రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం లో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకొని ఆమె మాట్లాడారు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలతో జన రంజక ప్రభుత్వంగా ముందుకు వెళుతుందన్నారు.
View More
Latest News
25 Apr 2025 11:34 AM
0
21
Newsread Image

No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
కురిచేడు: జెడ్పీ హైస్కూల్ లో సదుపాయాల కోసం ఎమ్మెల్యే ను కోరిన యువకులు
దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం లోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు క్రీడా మైదానం ను క్రీడలు ఆడుకునేందుకు అవకాశం కల్పించాలి అని బాలికల హాస్టల్ వేరే ప్లేస్ లో నిర్మించాలని యువకులు కోరగా అధికారులతో మాట్లాడతానని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగినది.
View More
Latest News
25 Apr 2025 11:03 AM
0
19
Newsread Image

No.1 Short News

Newsread
టీడీపీ కుటుంబానికి భరోసా - మృతి చెందిన కార్యకర్త కి నగదు సాయం
తాళ్లూరు మండలం, తూర్పు గంగవరం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త చాట్ల సుధాకర్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయి మృతి చెందాగా... గతం లో సుధాకర్ టిడిపి సభ్యత్వం తీసుకున్నారు.... టిడిపి సభ్యత్వం ఉండుటచే... వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి... శుక్రవారం దర్శి లోని డా || లక్ష్మీ నివాసం వద్ద చాట్ల సుధాకర్ సతీమణి నాగమణి గారికి 5,00,000 రూపాయల చెక్కుని అందజేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు. వారితో పాటు తూర్పు గంగవరం గ్రామ టిడిపి నాయకులు ఉన్నారు.
View More
Latest News
25 Apr 2025 10:20 AM
1
20
Newsread Image

No.1 Short News

Newsread
రేపు కురిచేడు లో ప్రజా దర్బార్
తేదీ : 25-04-2025, అనగా రేపు ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 గం||ల వరకు కురిచేడు టౌన్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగును.కావున కురిచేడు మండలం లోని ప్రజలు సమస్యలు ఉన్నవారు అర్జీతో పాటు హక్కు పత్రాలను తీసుకొని స్వయం గా డా|| గొట్టిపాటి లక్ష్మీ మేడం కి అందజేసి తమ సమస్యలను పరిష్కరించుకోగలరు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి సాధ్యమైనంత మేరకు తక్షణమే పరిష్కారాలు చూపిస్తారు. మిగిలిన వాటికి వినతుల ద్వారా వచ్చే సమస్యలు ఇక్కడి నుంచే విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తారు.
View More
Latest News
24 Apr 2025 20:02 PM
0
22
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు : దర్శి లో జరిగిన ముస్లింల శాంతి ర్యాలీలో పాల్గొన్న యువత
దర్శి లో జరిగిన ముస్లింల భారీ శాంతియుత నిరసన ర్యాలీకి ముండ్లమూరు మండలం ఉల్లగల్లు గ్రామం నుంచి ముస్లిం యువత కీలక పాత్ర పోషించడం జరిగింది. మండలం మొత్తం ర్యాలీ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విస్తృతస్థాయిలో ముస్లిం శ్రేణులు తరలివచ్చేందుకు కృషి చేశారు.
View More
Latest News
23 Apr 2025 23:22 PM
2
54
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి: ముస్లిం మహిళల్లో ఉప్పొంగిన సామాజిక చైతన్యం
దర్శి లో జరిగిన ముస్లింల భారీ శాంతియుత ర్యాలీలో తండోపతండాలుగా తరలివచ్చిన ముస్లిమ్ నారీమణులు. సహజంగా ఇళ్లలోనే పరిమితమై ఉండే ముస్లిం మహిళలు వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారీ నిరసనల్లో పాల్గొనడం, ముస్లిం మహిళల్లో సామాజిక చైతన్యం ఇప్పుడిప్పుడే మొదలైంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.
View More
Latest News
23 Apr 2025 23:09 PM
2
16
Newsread Image

No.1 Short News

Newsread
తురకపాలెం: విద్యుత్ షాక్ తో గాయపడ్డ కార్యకర్తను పరామర్శించిన బూచేపల్లి
దర్శి నియోజకవర్గం తాళ్లూరు మండలం తురకపాలెం గ్రామములో ఇటీవల విద్యుత్ షాక్ తో గాయపడ్డ పార్టీ కార్యకర్త యాతం సుబ్బారెడ్డి ని పరామర్శించి మనోధైర్యం కల్పించిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.
View More
Latest News
23 Apr 2025 22:54 PM
1
18
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు: కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
ఒంగోలు లో కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ లో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
View More
Latest News
23 Apr 2025 22:44 PM
2
11
Newsread Image

No.1 Short News

Newsread
ఒక్క గంట లో తప్పిపోయిన ముగ్గురు పిల్లలను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ప్రకాశం పోలీసులు
ఒంగోలు అన్నవరప్పాడు శ్రీ సూర్య విద్యానికేతన్ నందు 3వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ గేట్ నుండి వెళ్లిపోయి కనిపించలేదు. 1. షేక్ ఇస్మాయిల్ S/o అలీ ముర్తుజా, 09 సంవత్సరములు సంతపేట సాయిబాబా గుడి వద్ద, ఒంగోలు. 3rd Class. 2. కొంపల్లి సాల బిల్వనాధ్ S/o బుచ్చే శ్వరరావు, 10 సంవత్సరములు, 3rd Class, R/o ధారా వారి తోట ఒంగోలు. 3. అప్పాడిపాడు S/o నరసింహం, 09 సం, పల్లెపాలెం కొత్తపట్నం మండలం. 3rd Class. పోలీస్ లకు సమాచారం ఇవ్వగా వెంటనే స్పందించిన పోలీసులు ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు గారి ఆదేశములతో ఒంగోలు టు టౌన్ ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా, గంట వ్యవధిలోపలే తప్పిపోయి పిల్లలు అగ్రహారం రైల్వే గేటు వద్ద వారిని కనుగొని, సూర్య స్కూల్ వద్దకు తీసుకుని వచ్చి టూ టౌన్ ఇన్స్పెక్టర్ స్కూలు ప్రిన్సిపాల్ సమక్షంలో వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించడమైనది. తప్పిపోయిన తమ పిల్లలను తిరిగి క్షేమంగా వారి వద్దకు చేర్చినందుకు పిల్లలు తల్లిదండ్రులు మరియు స్కూలు యాజమాన్యం ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు. తప్పిపోయిన పిల్లలను కేవలం గంట వ్యవధిలోనే తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఒంగోలు టు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.
View More
Latest News
23 Apr 2025 22:37 PM
1
18
View Latest Short News
You are offline
Please check your internet connection.
Close

Find News

News Categories

  • All Categories
  • Jobs
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    ALL
    | newsread.in

    Install App

    Install App
    Cancel