కొండగురవయ్య స్వామి దేవస్థానంలో ఎన్టీఆర్ విగ్రహానికి గొట్టిపాటి లక్ష్మీ నివాళులు
దర్శి, జూన్ 1: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగురవయ్య స్వామి వారి దేవస్థానం వద్ద నిర్వహించిన కోటి మొక్కుబడి కార్యక్రమానికి దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్మ అన్నదాన సత్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.హెడింగ్:
కొండగురవయ్య స్వామి దేవస్థానంలో ఎన్టీఆర్ విగ్రహానికి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ నివాళులు