No.1 Short News

Newsread
సీఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ అభినందనలు
ఒంగోలు, మే 30: ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎస్‌ఐలుగా విధులు నిర్వహిస్తూ సీఐలుగా పదోన్నతి పొందిన అధికారులు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐలుగా పదోన్నతి పొందిన కె. కమలాకర్ (సీసీఎస్ పోలీస్ స్టేషన్), ఎం. మురళి (దర్శి పోలీస్ స్టేషన్), యు. వెంకటకృష్ణయ్య (టాస్క్ ఫోర్స్, ఒంగోలు)లను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ, సీఐ హోదాకు పదోన్నతి పొందడం వల్ల బాధ్యతలు మరింత పెరుగుతాయని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావం, నిబద్ధత, నిజాయితీతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ఠలను పెంపొందించేలా ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు తావు లేకుండా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన, ఉత్తమ పోలీసింగ్ సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ సూచించారు.
Latest News
30 May 2026 18:01 PM
1
48






😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (863)
  • Motivation (11)
  • Crime News (26)
  • Local Ads (39)
  • Entertainment (16)
  • Local Updates (220)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    Select Location
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.