పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వైసీపీ ఆధ్వర్యంలో దర్శిలో ర్యాలీ
దర్శి నియోజకవర్గంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీ చేపట్టారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ గారు పాల్గొన్నారు. అలాగే పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.