రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లె లో రమణాల వారి పాలెం కరిముల్లా లెవెన్స్ వెన్స్ ఘనవిజయం
తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో జరుగుతున్న GCC రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ఆదివారం కడప, రమణాలవారిపాలెం కరిముల్లా లెవెన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన రమణాలవారిపాలెం జట్టు 122 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 70 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 52 పరుగుల తేడాతో రమణాలవారిపాలెం కరిముల్లా లెవెన్స్ ఘన విజయం సాధించింది. జట్టులో 65 పరుగులు చేసిన నరేంద్రకు మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందజేశారు.