చీమకుర్తిలో బూచేపల్లి సుబ్బారెడ్డి 7 వ వర్ధంతి భారీగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సిపి నేతలు
చీమకుర్తిలో దర్శి మాజీ శాసన సభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సూర్య గ్రానైట్స్ సిబ్బందికి దుస్తుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , దర్శి ఎమ్మెల్యే మరియు ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయన జ్ఞాపకాలను నిలబెట్టుకోవడం గొప్ప విషయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.