నేను ఓడిపోలేదు.. ప్రజల గుండెల్లో గెలిచాను – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ వైరల్ కామెంట్స్
దర్శి టిడిపి కార్యాలయం వద్ద డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలు కూటమి శ్రేణులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి, గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ
దర్శి ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు జీవితాంతం మర్చిపోలేను. మీ హృదయాల్లో గెలిచాననే ఆనందం ఉంది. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ చేర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాను అన్నారు.
అమృత పథకం కొత్త సబ్ స్టేషన్లు రోడ్ల అభివృద్ధి మినీ స్టేడియం అన్నా క్యాంటీన్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
భారీ ఎత్తున టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.