కేక్ కట్ చేసి అభిమానులతో ఆనందం పంచుకున్న Dr. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ జన్మదిన వేడుకలను కురిచేడు మండలంలోని పడమటి వీరయపాలెం, వెంగాయపాలెం గ్రామాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో Dr. గొట్టిపాటి లక్ష్మీ Dr. కడియాల లలిత్ సాగర్ తో కలిసి కేక్ కట్ చేసి అభిమానుల అభినందనలు స్వీకరించారు.
కార్యక్రమంలో కురిచేడు మండల టిడిపి నాయకులు, మహిళలు, యువత, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల మధ్యే ఉంటూ సేవలందిస్తున్న నాయకురాలు Dr. గొట్టిపాటి లక్ష్మీ ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని కార్యకర్తలు ఆకాంక్షించారు.