No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
తిరుపతి లో 10 లక్షల to 150 సోలార్ కెమెరాల ఏర్పాటు: హర్షవర్ధన్ IPS
తిరుపతి: శాంతి, భద్రతల దృష్ట్యా తిరుపతి నగరంతోపాటు జిల్లా లో వివిధ ప్రదేశాలలో అమర్చేందుకు 10 లక్షల విలువైన 150 సోలార్ కెమెరాలను కొనుగోలు చేశామని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ అన్నారు.తిరుపతిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు ‌చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్ మీడియా తో మాట్లాడారు. సోలార్ కెమెరాలు సౌర శక్తితో పనిచేస్తాయని, ఇవి పర్యావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు చాలా అడ్వాన్స్ ఫీచర్స్ కలిగి ఆడియో మరియు వీడియో ఉంటుందన్నారు. సోలార్ కెమెరాలు విద్యుత్ అంతరాయం ఉండదన్నారు. సౌర శక్తితో పని చేస్తాయని, విద్యుత్తు లేని ప్రాంతాల్లో కూడా ఈ కెమెరాలు ఏర్పాటు చేసుకునే సౌకర్యంగా ఉంటుంది. వైర్లెస్ కనెక్టివిటీతో ఉంటుందని, స్మార్ట్ ఫోనులో మనం ఎక్కడ ఉన్న పర్యవేక్షించవచ్చున్నారు.ఇది మొబైల్ సిమ్ కార్డు ఆధారంగా పనిచేస్తుందన్నారు. ప్రధానంగా తిరుమలలో శాంతిభద్రతల దృష్ట్యా 20 సోలార్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నమన్నారు. అంతేకాకుండా తిరుపతి, చంద్రగిరి ఇతర ముఖ్య ప్రాంతాల్లో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన సోలార్ సిసి కెమెరా అమర్చేందుకు ఎర్పాట్లు చేస్తున్నమన్నారు. ఇప్పటికే జిల్లా లోని వివిధ ప్రదేశాలలో బ్లాక్ స్పాట్స్ గుర్తించామన్నారు.సోలార్ కెమెరాలు అమర్చడం ద్వారా కొంతవరకు అకతాయల, అల్లరి మూకలకు చెక్ పెట్టవచ్చన్నారు.గరుడ వారిది పై బ్లాక్ స్పాట్స్ గుర్తించి సోలార్ సిసి కెమెరాను ఏర్పాటు చేస్తాము. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు సోలార్ సిసి కెమెరాలు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాలలో పూర్తి స్థాయి లో సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. పోలీసు సిబ్బంది వెళ్లని ప్రదేశం కూడా డ్రోన్ కెమెరాతో వెళ్ళి గాలిస్తున్నాం. ఇలా చేయడం ద్వారా మెన్ పవర్ సేవ్ అవుతుంది. డ్రోన్ కెమెరాలతో గడిచిన కాలంలో గంజాయి స్ధావరాలతో పాటు నాటుసారాయి స్ధావరాలపై దాడులు చేసి కొంత మందిని అరెస్ట్ చేశామన్నారు. హోం స్టే కు సంబంధించిన లిస్ట్ మా వద్ద ఉంది. ప్రతి రోజు హోం స్టేలను మా సిబ్బంది చెక్ చేస్తున్నాము. హోం స్టే లో ఎదైన వివాదాలు జరిగితే అలాంటి వాటి పై యాక్షన్ సిరియస్ గా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారి పై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమంలో శ్రీ కె. రావిమనోహరచారి అదనపు ఎస్పీ, శ్రీ. సాదిక్ ఆలీ సీఐ ఎస్బి, శ్రీ వినోద్ కుమార్ సీ.ఐ. సైబర్ క్రైమ్స్,శ్రీ ఈశ్వర్ సీఐ కమాండ్ కంట్రోల్ శ్రీ రమణారెడ్డి ఆర్ఐ లు పాల్గొన్నారు.
Latest News
28 Apr 2025 16:32 PM
0
13