

No.1 Short News
PRASANNA ADN NEWS TVదరిశి శాఖా గ్రంధాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం..
వేసవి విజ్ఞాన శిబిరమును దర్శి శాఖ గ్రంధాలయంలో సోమవారం దర్శి మండల విద్యాశాఖ అధికారి కాకర్ల రఘురామయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి -1 కె.రఘురామయ్య ఎంఈఓ -2 ఏ రమాదేవి,బీడీసీఎల్ నిర్వాహకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగినది. రఘురామయ్య మాట్లాడుతూ గ్రంథాలయాలు వాటి వలన ఉపయోగాలు చెప్పారు. వేసవిలో చక్కగా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఆయన విద్యార్థులకువివరించడం జరిగినది. ఎంఈఓ రమాదేవి మాట్లాడుతూ చక్కటి గ్రంథాలయాలను ఉపయోగించుకొని మంచి మంచి కథలు చెప్పటం, చెప్పించడం చాలా ఉపయోగమని తెలియచేశారు. మేము కూడా ఈ గ్రంథాలయాల్లో చదువుకొని ఒక స్థాయిలో ఉండగలిగామని వారు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన గ్రంథపాలకురాలు విజయ కుమారికు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బీడీసీఎల్ నిర్వహకులు బి కోటయ్య, బి చెంచులింగం, భూషణ్ రావు, బి గోపి మరియు టీచర్ ఆదిలక్ష్మి పాఠకులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..
Latest News
28 Apr 2025 16:33 PM