

No.1 Short News
Newsreadటూరిస్టులపై దాడి పిరికిపంద చర్య: కైపు కృష్ణారెడ్డి
టూరిస్టులపై జరిగిన ఉగ్ర దాడి పిరికి పంద చర్య అని కైపు వెంకటకృష్ణా రెడ్డి విమర్శించారు. స్థానిక గడియారం స్తంభం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ దాడిలో 26 మంది చనిపోవడం, మరికొంత మంది గాయపడటం తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయ పడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దాడిలో మరణించిన వారిలో ముగ్గురు తెలుగు వాళ్లు ఉండటం అత్యంత బాధాకరం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు. అలాగే ఉగ్రవాదంపై పోరుకు యావత్ దేశం కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కేంద్ర, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఈ దుర్ఘటన దేశంలో శాంతి భద్రతల వైపల్యానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. దేశంలో శాంతిభద్రతలు గాలికొదిలేసి రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చే పనిలో హెూం మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నార ని విమర్శించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హెూంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కైపు వెంకటకృష్ణా రెడ్డి డిమాండ్ చేశారు.
Latest News
27 Apr 2025 10:17 AM