విద్యార్థులు పట్టుదలతో ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలి.. : మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి..
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలోని RMS ఇంగ్లీష్ మీడియం స్కూల్ 6 వ వార్షికోత్సవములో పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లితండ్రుల ను ఉద్దేశించి మాట్లాడుతూ వెనుకబడిన మార్కాపురంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి విద్యార్థులనకు మంచి ఇంగ్లీష్ విద్యను అందించడం అభినందనీయమని అన్నారు.మార్కాపురం పట్టణం ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నదని ఇప్పుడు కాలనీలలో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టటం జరిగిందని ఒకప్పుడు త్రాగునీటికి కూడా ఇబ్బంది పడ్డ మార్కాపురం పట్టణం నేడు పట్టణo నకు త్రాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ప్రాంతం నుండి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ లోలు విద్యార్థులు సాధించడం ఆరుదని ఇప్పటినుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి ప్రణాళికతో చదివి దానిని సాధించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు..