No.1 Short News

మీ వార్తల కోసం Call: 9948680044 - Reporter Sk.Asma
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన పలు ప్రజాసంఘాల నాయకులు..
గత 30 సంవత్సరముల సుదీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఏబిసిడి వర్గీకరణ అమలు ను మాదిగ జాతి తో పాటు 58 ఉపకులాలు జాతి ప్రజలు వినియోగించుకోవాలని పలువురు వక్తలు కోరారు. ముందుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణములో గల అంబేద్కర్ విగ్రహం నుండి దర్శి నియోజకవర్గంలోని మాదిగ జాతి ఉద్యోగులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు డప్పు వాయిద్యాలతో ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం వద్ద మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు గత 30 సంవత్సరాలలో జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఆటు పోట్లను అనుభవించారని ఎందరో విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని వారి త్యాగాల ఫలితమే నేటి వర్గీకరణ రావడానికి కారణమన్నారు. ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ఫలాలను మాదిగ జాతి తో పాటు ఉపకులాలలోని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునే దిశగా ఉండాలని భక్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు నేరెళ్ల జాన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జాతీయ మాదిగ ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు బొంత ఏసుదాసు. ప్రకాశం జిల్లా మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు తాళ్లూరి ఆల్ఫ్రెడ్. తాళ్లూరి శేషు. నూనె పాల్ గాంధీ. రిటైర్డ్ ఎస్సై దారి వేముల ఎలీషా. కేసనపల్లి కోటేశ్వరరావు. ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుంటు పోలయ మాదిగ. నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ. మాదిగ విద్యార్థి సంఘ నాయకులు రాచపూడి కరుణానిధి. కంభం పాటి జోసెఫ్ మాదిగ. ఎమ్మార్పీఎస్ నాయకులు రాజపూడి మోషే. గూడూరి నాగమల్లేశ్వరరావు. పలువురు డప్పు కళాకారులు ఎమ్మార్పీఎస్. ఎం ఈ ఎఫ్. పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Local Updates
26 Apr 2025 22:35 PM
3
48