No.1 Short News

Newsread
ప్రకాశం: జిల్లాలో అడుగడుగునా పోలీసుల విస్తృత తనిఖీలు
లాడ్జిలు, హోటల్, వాహనాలు మరియు పలు ప్రదేశాలను విస్తృతంగా తనిఖీలు చేస్తున్న ప్రకాశం జిల్లా పోలీసులు లాడ్జి, హోటల్స్ అనుమానాస్పదంగా అన్పిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరండి. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్ దామోదర్, ఐపియస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జి,డార్మిటరీస్, హోటల్,వాహనాలను మరియు పలు ప్రదేశలను తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని లాడ్జీల్లో పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేయటం నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పలు ప్రదేశాలను డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూనే హెల్మెట్/ సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్ తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై ఎం.వి చట్టంప్రకారం చర్యలు తీసుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ మద్యం, గంజాయి వంటి మాదకద్రవ్యాలు రవాణా జరగకుండా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Latest News
26 Apr 2025 21:54 PM
1
19