

No.1 Short News
PRASANNA ADN NEWS TVనర్సింగ్ సేవల అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ..
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గత ఆరు దశాబ్దాల్లో (ఉమ్మడి రాష్ట్రంతో కలిపి) మొట్టమొదటి సారిగా ఫ్లోరెస్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుతూ నర్సింగ్ సేవలకు సంబంధించి వివిధ కేటగిరీల్లో ఉత్తమ సేవల్ని అందించిన వారికి ఫ్లోరెస్స్ నైటింగేల్ అవార్డులు-2025 ప్రదానం చేయనుంది. నాలుగు కేటగిరీలు..నర్స్ అడ్మి నిస్ట్రేటర్, నర్స్ ఎడ్యుకేటర్, నర్స్ రిసెర్చెర్ నర్సింగ్ సర్వీసెస్(ANMలు, స్టాఫ్ నర్సులు, హెడ్ నర్సులు) లకు ప్రభుత్వ, ప్రైవేట్, రైల్వే ఆసుపత్రులు, PHC, CHC, ESI, నర్సులు ఈ అవార్డులకు దరఖాస్తులు చేయవచ్చు.
అవార్డు వివరాలు
25,000 /- నగదు, నర్సింగ్ కౌన్సిల్ షీల్డ్ ఇస్తారు. ఆరోజు TA/DA లు ఇస్తారు.
అవార్డు ఎంపిక కమిటీ:
▪️వైద్య ఆరోగ్య శాఖ హెచ్.ఓ.డి లు
▪️డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్
▪️రిజిస్ట్రార్, నర్సింగ్ కౌన్సిల్
▪️సీనియర్ ప్రిన్సిపల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ విద్యాసంస్థలు.
అర్హత ప్రమాణాలు, దరఖాస్తు మార్గదర్శకాల పూర్తి సమాచారం కొరకు
https://hmis.ap.nic.in/ వెబ్ సైట్ చూడండి.
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
ఈమేరకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ప్రత్యక్షంగా గానీ లేదా పోస్టు, కొరియర్ ద్వారా..
The Registrar,
AP Nurses & Midwives Council,
Government General Hospital (old) Campus,
Olo Director of Medical Education Hanumanpet, Vijayawada- 520002, Amaravathi, AP.
Latest News
26 Apr 2025 18:56 PM