

No.1 Short News
PRASANNA ADN NEWS TVజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతవరం నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ..
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోతవరం నందు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాఠశాలలో మొదటి మూడు స్థానాల్లో సాధించిన విద్యార్థులకు పోతవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ కోరే బాల రంగ సాయి గారు ఏడువేల రూపాయలు నగదు బహుమతుల్ని అందించారు. వీరిలో గురు ప్రసన్న నియోజకవర్గస్థాయిలోని ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు 586 మార్కులు సాధించింది. ప్రదీప్ 547 మార్కులు, తోక రామలక్ష్మి 541 మార్కులు సాధించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నర్రా వెంకటేశ్వర్లు గారు, పోతవరం ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ధనిరెడ్డి వెంకటరెడ్డి గారు (UTF సీనియర్ నాయకులు )పాఠశాల ఉపాధ్యాయులు టి. విజయ భాస్కర్ రెడ్డి, ఐ వి ఎల్ నారాయణ, వై జి లివింగ్స్టన్, వివిఎస్ శాస్త్రి, టి.బాలసుబ్బయ్య, డి.మాన్ సింగ్, జి.శిల్పకుమారి, జి సుధారాణి, ఎ. ఖాశీం పాల్గొని విద్యార్థులని అభినందించారు..
Latest News
26 Apr 2025 18:09 PM