

No.1 Short News
PRASANNA ADN NEWS TVపదో తరగతి ఫలితాల్లో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిన యరగూటి నిత్యను సన్మానించిన దర్శి MRO
ఈ రోజు దరిశి స్థానిక తహశిల్దారు కార్యాలయంలో, ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబర్ మరియూ మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో.. పదోతరగతి ఫలితాలలో ప్రకాశం జిల్లాలో మొదటి స్థానం 600 మార్కులకు గాను 598 పశ్చిమ ప్రకాశానికి రాగా, 600 మార్కులకు 597మార్కులు సాధించి ఒకే ఒక్క మార్కు తేడాతో దరశి ప్రాంతానికి చెందిన ఆణిముత్యం యరగూటి నిత్య జిల్లాలో ద్వితీయ స్థానాన్ని సొంతం చేసికొన్న శుభ సందర్భంగా దరిశి మండల తహశిల్దారు మరియు మండల ఎగ్జికూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్,కపురం శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా దుశ్శాలువాతో,పూల బొకేలతో నిత్యను ఘనంగా సత్కరించి స్వీట్లు పంచుకొని,మధురానుభూతులు పొందారు.ఈ సందర్భంగా తహశిల్దారు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇలాంటి శుభసందర్భాలు జీవితంలో చాలా రావాలని నిత్య ను కొనియాడి మనసారా దీవించి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కపురం శ్రీనివాసరెడ్డి మాట్లడుతూ.. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన నిత్య నిరుపేద విద్యార్థులందరికీ ఆదర్శవంతంగా వుండాలని దీవించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నిత్య తండ్రి రాజశేఖరరెడ్డి, రెవెన్యూసిబ్బంది పాల్గొన్నారు..
Latest News
26 Apr 2025 18:10 PM