

No.1 Short News
గంగాధర్,అదిలాబాద్ జిల్లాఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించిన మంత్రి సీతక్క
ఆదిలాబాద్ జిల్లా :ఇంద్రవెళ్లి అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేసిన మంత్రులు ఎమ్ ఎల్ ఎలు,మంత్రి సీతక్క మాట్లాడుతూ
ఇక్కడి మట్టికి గొప్పదనం ఉంది, ఇక్కడి గాలిలో పౌరుషం ఉంది. తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు,ఎమ్మెల్సీ దండే విఠల్ ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క,ఎమ్మెల్సీ దండే విఠల్,ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు,ఎంపీ నగేశ్, గిరిజన శాఖ చైర్మెన్ కోట్నాక్ తిరుపతి, మాజీ ఎంపీ సోయం బాపు ,మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ,2021 ఆగస్టు 8న ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో ‘దళిత గిరిజన దండోరా’ సభతో కేసీఆర్ గారి మీద నాటి పీసీసీ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్య స్థాపనకు బయలుదేరారు,ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తితో అసెంబ్లీ ఎన్నికల ముందు సమరశంఖం పూరించిన రేవంత్ రెడ్డి, అభివృద్ధిలో అట్టడుగునున్న ఆదిలాబాద్ జిల్లాను అగ్రభాగాన నిలుపడానికి ఇక్కడి నుంచే అభివృద్ధి శంఖారావం పూరించడం మనకు ఎంతో గర్వకారణం. జిల్లాలోని ఆదివాసీ గూడేల్లోని పేదలకు కూడు, గూడు కల్పించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షానే నిలుస్తుంది,అమరవీరుల స్తూపంతో పాటు నాగోబా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు.నేడు ఆ మాటను నిలబెట్టుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తోంది,అమరవీరుల స్మృతి వనం ఏర్పాటుకు చర్యలు చేపట్టడం చారిత్రాత్మకమం,అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు రూ. 97.లక్షలు కేటాయించిన గౌరవ ముఖ్య మంత్రి గారికి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Politics
21 Apr 2025 00:36 AM