🔎 వార్తలు వెతకండి
Category, Location లేదా Keyword తో filter చేయండి
31 Aug, 10:24 PM
అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై రూ.1,000 కోట్ల బ్రిడ్జి!
విజయవాడ–అమరావతి మధ్య మరో ప్రతిష్ఠాత్మక మౌలిక వసతుల ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీకి సుమారు 300 మీటర్ల దిగువన, రైల్వే బ్రిడ్జి మధ్యలో 1.10 కి.మీ పొడవుతో ఆరు లేన్ల సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించింది. ఇరువైపులా ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లతో అంతర్జాతీయ ప్రమాణాల్లో దీనిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం సుమారు ₹1,000 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఫీజిబిలిటీ, DPR కోసం కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.
31 Aug, 09:40 PM
కాజీపేట నూతన బస్టాండ్‌కు భూమి మార్పిడి వేగవంతం చేయాలి
మహబూబాబాద్: కాజీపేట నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హౌసింగ్, రెవెన్యూ అంశాలపై జరిగిన సమీక్షలో ఈ విజ్ఞప్తి చేశారు.ఎంపీ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పొంగులేటి, ప్రభుత్వ భూముల లభ్యతను పరిశీలించి, భూమి మార్పిడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.
31 Aug, 09:33 PM
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు మెస్సీ రిటైర్మెంట్
అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2026 ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిన రెండు రోజులకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల తన తండ్రి జార్జ్ మెస్సీ మరణం కూడా తన నిర్ణయాన్ని మరింత బలపరిచిందని చెప్పారు. అర్జెంటీనా తరఫున 207 మ్యాచ్‌లు ఆడి 125 గోల్స్ చేసిన మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికారు.
31 Aug, 09:17 PM
బెంగళూరులో 31 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్
బెంగళూరు: నగరంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించిన 31 మంది బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో వీరిని గుర్తించారు. పోలీసుల ఎస్కార్ట్‌తో 31 మందిని బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు తరలించారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అనుమానితులపై నిఘా కోసం చేపట్టిన ‘ఆపరేషన్ ముక్త’ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
31 Aug, 08:53 PM
మాగుంట మాటలను ఖండించిన బూచేపల్లి.
వెంటనే జగన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్.
31 Aug, 08:49 PM
నీళ్లు లేకుండా 40 ఏళ్లుగా వ్యవసాయం.. అమెరికా రైతు అద్భుతం!
అమెరికాలోని ఒరెగాన్‌లో ఒక రైతు ఏకంగా 40 ఏళ్ల పాటు చుక్క నీటిని కూడా ఉపయోగించకుండా వ్యవసాయం చేసి అందరినీ విస్మయానికి గురిచేశారు. టమాటాలు, బంగాళదుంపలు, వెల్లుల్లి, గుమ్మడి వంటి పలు రకాల పంటలను కేవలం భూమిలో నిల్వ ఉన్న తేమ ఆధారంగానే ఆయన విజయవంతంగా పండించారు. 1974 నుంచి 2014 వరకు ఆయన ఈ వినూత్న పద్ధతిలో సాగును కొనసాగించడం విశేషం.
31 Aug, 08:23 PM
31 Aug, 06:20 PM
సీఎం పర్యటనకు పోలీసుల పటిష్ట కవచం..ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన!
మార్కాపురం: వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్, వీఐపీ రూట్, జలహారతి, పైలాన్, ప్రజావేదిక, పార్కింగ్ ప్రాంతాల్లో గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో బందోబస్తు, ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
31 Aug, 05:19 PM
గ్యాస్ట్రో వైద్య సేవల్లో రాష్ట్రం నలుమూలల నుంచి గుంటూరుకే.. లివర్ వైద్యంలో డా. ఎస్.కె. నాగూర్ బాషాకు ప్రత్యేక గుర్తింపు!
గుంటూరు: లివర్, జీర్ణాశయ సంబంధిత సమస్యలకు నిపుణుల వైద్యం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రోగులు గుంటూరుకు వస్తున్నారు. వారిలో పలువురు కేర్ వెల్ హాస్పిటల్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. ఎస్.కె. నాగూర్ బాషాను సంప్రదిస్తున్నారు. లివర్ సంబంధిత సమస్యలపై ఆయన అందిస్తున్న వైద్య సేవలు, రోగులతో ఆయన వ్యవహరించే తీరు, వైద్య పరిజ్ఞానం కారణంగా గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో డా. నాగూర్ బాషా ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి కూడా ఆయనను సంప్రదిస్తున్న రోగులు ఉండటంతో గుంటూరులో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
31 Aug, 04:41 PM
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ లో పోలీసుల తనిఖీలు.. అనుమానితులపై నిఘా
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ఆర్టీసీ బస్టాండ్‌లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను పరిశీలిస్తూ, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
31 Aug, 03:45 PM
31 Aug, 03:39 PM
వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన మౌలానా హుస్సేన్ అహ్మద్
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన మౌలానా హుస్సేన్ అహ్మద్ మజహరి, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీతో కలిసి న్యాయ & మైనారిటీ శాఖ మంత్రి NMD ఫరూఖ్‌ను మతపెద్దలతో మర్యాదపూర్వకంగా కలిశారు. పదవి కల్పించినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
31 Aug, 02:18 PM
కృష్ణాజలాలకు సీఎం చంద్రబాబు జలహారతి
యర్రగొండపాలెం: గంటవానిపల్లి సమీపంలోని వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద సీఎం చంద్రబాబు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు. నీటిలోకి దిగి పసుపు, కుంకుమ, చీర సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు, చిన్నారులు లంబాడా నృత్యాలతో సందడి చేశారు. మంత్రులు, ఎంపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
30 Aug, 11:03 PM
వెలిగొండతో మార్కాపురం రూపురేఖలు మారతాయి: మంత్రి గొట్టిపాటి
అమరావతి, ఆగస్టు 30: వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం ప్రాంత రూపురేఖలు మారనున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మూడు దశాబ్దాల కల సాకారం చేస్తూ ఆదివారం సీఎం చంద్రబాబు ప్రాజెక్టును ప్రారంభించనున్నారని తెలిపారు. వెలిగొండతో కరువు ప్రాంతాలకు సాగు, తాగునీటి భద్రత పెరిగి వ్యవసాయం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు.
30 Aug, 07:53 PM
రేపు మార్కాపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ట్రాఫిక్ మళ్లింపు అలర్ట్ ఇదిగో!
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు. గుంటూరు నుంచి ఆత్మకూరు వెళ్లే వాహనాలు: ఈ వాహనాలను గిద్దలూరు మీదుగా నంద్యాలకు మళ్లిస్తారు. అక్కడి నుంచి ఆత్మకూరుకు ప్రయాణించాల్సి ఉంటుంది.
దేవరాజుగట్టు నుంచి చిన్న దొరకనల్ వెళ్లే మార్గం: ఈ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు.
శ్రీశైలం వైపు వెళ్లే / శ్రీశైలం నుంచి వచ్చే వాహనాలు: ఈ వాహనాలు దొరకనల్ పట్టణంలోకి ప్రవేశించకుండా, బైపాస్ రోడ్డును వినియోగించుకోవాలి. ఆత్మకూరు వెళ్లాలనుకునే వారు గిద్దలూరు, నంద్యాల మీదుగా ప్రయాణించాలి.
ఆత్మకూరు నుంచి గుంటూరు / శ్రీశైలం వెళ్లే వాహనాలు: ఈ వాహనాలు కూడా నంద్యాల, గిద్దలూరు మార్గంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. సీఎం పర్యటన ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని డీఎస్పీ నాగరాజు కోరారు.
30 Aug, 07:50 PM
ప్రపంచానికే ప్రళయం వచ్చినా.. ఈ దేశం తట్టుకుని నిలబడుతుంది!
ప్రపంచవ్యాప్తంగా పెను విపత్తు సంభవించి, మానవ నాగరికతకే ముప్పు వాటిల్లితే ఏ దేశం తట్టుకోగలదు? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు జర్మనీలోని హేగన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఒక విస్తృత అధ్యయనం చేపట్టారు. ‘గ్లోబల్ ఛాలెంజెస్’ అనే ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, అలాంటి తీవ్రమైన విపత్తులను ఎదుర్కొని నిలబడగల అత్యంత స్థితిస్థాపకత కలిగిన దేశం ఆస్ట్రేలియా అని తేలింది.
30 Aug, 07:45 PM
LPG వినియోగదారులకు బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ డేట్! ఈ పని చేయకపోతే ఇబ్బందులు తప్పవు
దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు ముఖ్యమైన అప్డేట్. గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేసేందుకు ఆగస్టు 31, 2026 వరకు గడువు విధించారు. ఈ గడువు తర్వాత మరింత పొడిగింపు ఉండదని చమురు కంపెనీలు డీలర్లకు సమాచారం ఇచ్చినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు e-KYC పూర్తి చేయని వినియోగదారులు వెంటనే తమ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. అలాగే సంబంధిత LPG కంపెనీ అధికారిక యాప్ ద్వారా మొబైల్‌లోనే ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్‌తో e-KYC చేసుకునే అవకాశం ఉంది. e-KYC పూర్తి చేయకపోతే భవిష్యత్తులో LPG రీఫిల్ బుకింగ్, దేశీయ ధరలపై సిలిండర్ పొందడం లేదా సబ్సిడీ ప్రయోజనాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. అయితే e-KYC చేయలేదనే కారణంతో వెంటనే LPG కనెక్షన్ రద్దవుతుందని అధికారికంగా స్పష్టత లేదు.
30 Aug, 07:40 PM
30 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే ‘వెలిగొండ ప్రాజెక్టు’ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
Veligonda Project: దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావం, ఫ్లోరైడ్ సమస్యలతో కరువును ఎదుర్కొంటున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. వెలిగొండ (Veligonda Project)సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్వయంగా ప్రారంభించి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. 1996 మార్చి 5న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబే, 30 ఏళ్ల తర్వాత దాని తొలి దశను ప్రారంభించడం ఒక అరుదైన చారిత్రక ఘట్టంగా నిలిచింది. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరిట ప్రభుత్వం ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తోంది.
4.47 లక్షల ఎకరాలకు సాగునీరు – 23 లక్షల మందికి దాహార్తి తీర్చే ప్రాజెక్టు:
శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 మండలాల్లోని 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. ఫేజ్-1 కింద 10.70 టీఎంసీల నీటిని విడుదల చేయడం ద్వారా తొలి విడతలోనే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు లభించనుంది. దీనివల్ల వ్యవసాయ రంగానికి భరోసా పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగై గిరిజన, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలకు అడ్డుకట్ట పడనుంది.
48 రోజుల్లో రూ.768 కోట్ల పరిహారం – వేగంగా సీఎం పర్యటన షెడ్యూల్:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వాసితుల పరిహారానికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. కేవలం 48 రోజుల వ్యవధిలోనే రూ.768 కోట్ల పరిహారాన్ని చెల్లించి పనులను వేగవంతం చేసింది. షెడ్యూల్ ప్రకారం సీఎం చంద్రబాబు ఉదయం 10.15 గంటలకు దోర్నాల మండలం గంటవానిపల్లి చేరుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం వెలిగొండ ఫేజ్-1ను ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించి జలాలను విడుదల చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
30 Aug, 08:27 AM
నేపాల్ జలప్రళయం: 675కి చేరిన మృతులు.. ఆపన్నహస్తం అందిస్తున్న భారత్
పొరుగు దేశం నేపాల్‌ను భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా సంభవించిన ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు పర్యాటకులపైనా తీవ్ర ప్రభావం చూపింది. 589 మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకులతో సంబంధాలు తెగిపోయినట్లు నేపాల్ పర్యాటక శాఖ నిన్న సాయంత్రం ప్రకటించింది.
30 Aug, 08:23 AM
హాకీ ప్రపంచకప్ అర్జెంటీనా కైవసం.. ఫైనల్లో నెదర్లాండ్స్‌పై ఉత్కంఠ విజయం
మహిళల హాకీ ప్రపంచకప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. నిన్న ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో, షూటౌట్‌లో 3-1 తేడాతో ఆతిథ్య నెదర్లాండ్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది.
29 Aug, 11:11 PM
సీఎం చంద్రబాబు పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్, జలహారతి, పైలాన్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనకు ఎలాంటి భద్రతా లోపాలు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
29 Aug, 10:39 PM
గొట్టిపాటి లక్ష్మీకి చంద్రబాబు ప్రత్యేక ప్రశంస!
దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ఆమె చేస్తున్న సేవలను చంద్రబాబు ప్రశంసించారు. ఈ గౌరవంతో దర్శి టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.
29 Aug, 10:31 PM
దర్శిలో ‘ఇంటింటికీ టీడీపీ’.. ప్రజలతో డాక్టర్ లక్ష్మీ మమేకం!
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా చేపట్టిన 45 రోజుల ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా దర్శి 5వ వార్డులో టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిపై ప్రగతి నివేదికలను అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, కూటమి నాయకులు పాల్గొన్నారు.
29 Aug, 10:02 PM
దర్శిలో టీడీపీ ప్రజాదర్బార్.. సమస్యలపై తక్షణ స్పందన!
దర్శి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
29 Aug, 07:45 PM
అల్పపీడనం ఎఫెక్ట్ - ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై వాతావరణ శాఖ కీలక సమాచారం అందించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రేపటికి వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్-ఉత్తర ఒడిశా తీర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలకుతోడు ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
25 Aug, 10:11 PM
ఏకగ్రీవమైతే ఎమ్మెల్యే టికెట్ కట్!”.. జగన్ సంచలన వార్నింగ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ లేకుండా ఏకగ్రీవం అయితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్‌కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రతి చోటా పోటీ జరగాల్సిందేనని పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికల అనంతరం స్థానిక ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై పూర్తి స్థాయి రిపోర్ట్ తెప్పించుకుంటానని జగన్ పేర్కొన్నారు.
25 Aug, 09:07 PM
11 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!
చీరాల దండుబాట రోడ్డు టీ జంక్షన్ వద్ద 1 టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు తెలిపారు.
25 Aug, 08:44 PM
స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతను కాపాడండి.. వైసీపీ డ్రామాలను నమ్మొద్దు: లోకేశ్
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు సమష్టిగా పనిచేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ సముచిత గుర్తింపు, గౌరవం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
25 Aug, 08:42 PM
బీసీలపై కక్ష సాధింపు వైసీపీదే.. మాది కాదు: మంత్రి అచ్చెన్నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీల ఆత్మగౌరవ పరిరక్షకుడని, ఆయన నాయకత్వంలోనే బీసీలకు నిజమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక సాధికారత లభించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసుల్లో చట్ట ప్రకారం దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటుంటే, వాటిని బీసీలపై కక్ష సాధింపుగా చిత్రీకరించే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
25 Aug, 08:40 PM
పిల్లల ఫోన్లలో ఈ ఎమోజీలున్నాయా? పోలీసుల కీలక హెచ్చరిక
డిజిటల్ యుగంలో పిల్లల భద్రత అనేది తల్లిదండ్రులకు పెను సవాలుగా మారింది. ఆన్‌లైన్ ప్రపంచంలో వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారనే దానిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, సైబర్ నేరగాళ్లు పిల్లలను లక్ష్యంగా చేసుకోవడానికి ఎంచుకుంటున్న కొత్త మార్గాలపై సైబరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. మనం సాధారణంగా భావించే ఎమోజీలనే రహస్య సంకేతాలుగా వాడుతూ, పిల్లలను తమ వలలో వేసుకునేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు.
25 Aug, 08:22 PM
గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏర్పాట్లు అద్భుతంగా ఉండాలి!
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పుష్కరాల పనుల పురోగతిపై సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
25 Aug, 08:17 PM
ట్రాన్స్‌జెండర్ ను పెళ్లాడిన పూజారి.. వీడియో వైరల్
సమాజంలో నెలకొన్న మూస ధోరణులను, అపోహలను పటాపంచలు చేస్తూ ఓ జంట ఒక్కటైంది. ప్రేమకు లింగభేదాలు అడ్డురావని నిరూపిస్తూ ఓ ఆలయ అర్చకుడు, ట్రాన్స్‌జెండర్ మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఈ ఆదర్శ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే, కడలూరుకు చెందిన ఆలయ అర్చకుడు నాగరాజన్, అదే ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళ సంజనను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల పూర్తి అంగీకారంతో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో పాటు పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు ఈ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు.
25 Aug, 12:31 PM
ట్రాఫిక్ చలాన్లను ఫాస్టాగ్ నుంచి నేరుగా కట్ చేసే ప్రతిపాదన ఈ ఆలోచనపై హెచ్‌ఎండీఏతో చర్చిస్తున్నట్టు తెలిపిన పోలీసులు టెక్నాలజీతో ట్రాఫిక్ నిబంధనల అమలును పటిష్ఠం చేసేందుకు యోచన మెరుగైన ప్రజా రవాణా, పార్కింగ్ సౌకర్యాలు అవసరమని వెల్లడి హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల ద్వారా మినహాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ వినూత్న విధానం అమలు చేసే విషయమై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులతో చర్చిస్తున్నామని, దీనిపై వారి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సున్‌ప్రీత్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రజలు, భాగస్వామ్యం, సాంకేతికత ద్వారా సురక్షితమైన రహదారుల నిర్మాణం" అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ప్యానలిస్ట్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్ఠం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని వివరించారు. కేవలం జరిమానాలు విధించడం వల్ల మాత్రమే వాహనదారుల ప్రవర్తనలో శాశ్వత మార్పు రాకపోవచ్చని, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. గడిచిన రెండు దశాబ్దాలలో హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రాణాంతక ప్రమాదాలు కూడా పెరిగాయని సున్‌ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి భద్రత విషయంలో ప్రభుత్వంతో పాటు పౌరులకూ సమాన బాధ్యత ఉంటుందన్నారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, లాస్ట్-మైల్ కనెక్టివిటీ, మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, టెక్నాలజీ ప్రొవైడర్లు, పౌరుల మధ్య సమన్వయం, భాగస్వామ్యం పెరిగితేనే రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
క్వాంటం వ్యాలీ పనులను పరిశీలించిన నారాయణ
ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం వ్యాలీ నిర్మాణం
చివరి దశకు చేరుకున్న ప్రధాన భవన నిర్మాణం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీకి గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రూపుదిద్దుకుంటున్న ‘క్వాంటం వ్యాలీ’ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. గతంలో హైదరాబాద్ నగరానికి ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన విధంగానే, అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఐబీఎం, టీసీఎస్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో 45,216 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రధాన నిర్మాణం ఇప్పటికే చివరి దశకు చేరుకోగా, సెప్టెంబర్ 15 నాటికి అంతర్గత పనుల కోసం ఈ భవనాన్ని ఐబీఎమ్‌కు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భవనంలో క్వాంటం ల్యాబ్ నిర్మాణం అత్యంత విశిష్టంగా సాగుతోంది. బయటి ట్రాఫిక్ శబ్దాలు, ఇతర శబ్ద తరంగాలు ల్యాబ్‌ను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ‘రూమ్ వితిన్ రూమ్’ డిజైన్‌తో పాటు ప్రత్యేక శబ్ద నియంత్రణ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
క్వాంటం చిప్‌లు అత్యుత్తమంగా పనిచేసేందుకు ఉష్ణోగ్రతను మైక్రో స్థాయికి తీసుకెళ్లేలా మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ అల్ట్రా-కోల్డ్ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. దీనికోసం క్రయోజెనిక్ డైల్యూషన్ రిఫ్రిజిరేటర్లు, హీలియం కంప్రెసర్లను ల్యాబ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రికల్ పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ కోసం ‘డ్యూయల్ యాక్టివ్ ఫీడర్ సిస్టమ్’ను, పవర్ శబ్దాలను నివారించడానికి ‘K13 రేటెడ్ ఐసోలేషన్ ట్రాన్స్‌ఫార్మర్ల’ను అందుబాటులోకి తెస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాన్ని కార్బన్ ఉద్గారాలు తగ్గించే ‘గ్రీన్ బిల్డింగ్’ విధానంలో రూపుదిద్దుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ విస్తరణలో భాగంగా క్వాంటం ల్యాబ్ పక్కనే ఉన్న 50 ఎకరాల విస్తీర్ణంలో రెండు భారీ ఐకానిక్ టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఒక్కొక్కటి 48 అంతస్తుల మేర (సుమారు 202 మీటర్ల ఎత్తు) నిర్మించే ఈ టవర్లలో గ్లోబల్ టెక్ కంపెనీలు, డెవలప్‌మెంట్ సంస్థలు, నూతన స్టార్టప్‌లకు స్థలాన్ని కేటాయించనున్నారు. క్వాంటం వ్యాలీ భవనానికి సంబంధించిన మెకానికల్, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ పనులను రాబోయే రెండు నెలల్లో పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
25 Aug, 12:09 PM
ట్రాఫిక్ చలాన్లకు కొత్త విధానం.. ఫాస్టాగ్ ఖాతా నుంచి నేరుగా వసూలుకు ప్లా
ట్రాఫిక్ చలాన్లను ఫాస్టాగ్ నుంచి నేరుగా కట్ చేసే ప్రతిపాదన
ఈ ఆలోచనపై హెచ్‌ఎండీఏతో చర్చిస్తున్నట్టు తెలిపిన పోలీసులు
టెక్నాలజీతో ట్రాఫిక్ నిబంధనల అమలును పటిష్ఠం చేసేందుకు యోచన
మెరుగైన ప్రజా రవాణా, పార్కింగ్ సౌకర్యాలు అవసరమని వెల్లడి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల ద్వారా మినహాయించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఈ వినూత్న విధానం అమలు చేసే విషయమై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అధికారులతో చర్చిస్తున్నామని, దీనిపై వారి నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఇటీవల సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సున్‌ప్రీత్ సింగ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రజలు, భాగస్వామ్యం, సాంకేతికత ద్వారా సురక్షితమైన రహదారుల నిర్మాణం" అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ప్యానలిస్ట్‌గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత పటిష్ఠం చేయడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని వివరించారు. కేవలం జరిమానాలు విధించడం వల్ల మాత్రమే వాహనదారుల ప్రవర్తనలో శాశ్వత మార్పు రాకపోవచ్చని, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి టెక్నాలజీ ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
గడిచిన రెండు దశాబ్దాలలో హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు ప్రాణాంతక ప్రమాదాలు కూడా పెరిగాయని సున్‌ప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి భద్రత విషయంలో ప్రభుత్వంతో పాటు పౌరులకూ సమాన బాధ్యత ఉంటుందన్నారు. మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, లాస్ట్-మైల్ కనెక్టివిటీ, మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, టెక్నాలజీ ప్రొవైడర్లు, పౌరుల మధ్య సమన్వయం, భాగస్వామ్యం పెరిగితేనే రహదారి భద్రత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
25 Aug, 12:06 PM
బళ్లారిలో నారా లోకేశ్ కు ఘన స్వాగతం.. కాసేపట్లో సుజ్లాన్ బ్లేడ్ యార్డును సందర్శించనున్న లోకేశ్
బళ్లారి మండల హాలకుందిలోని సుజ్లాన్ యార్డును సందర్శించనున్న లోకేశ్
అనంతపురం జిల్లా హులికెరలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
సుజ్లాన్ ‘S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్’ను అధికారికంగా ప్రారంభించనున్న లోకేశ్
ఏపీ మంత్రి నారా లోకేశ్ కర్ణాటకలోని బళ్లారిలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం బళ్లారిలోని జిందాల్ విజయ్‌నగర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు కర్ణాటక మంత్రి నాగేంద్ర, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, పల్లె సింధూర రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్‌లతో పాటు టీడీపీ నాయకులు,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
25 Aug, 11:09 AM
పంచదార ధరలకు షాక్.. కిలో రూ.70!
నెల రోజుల్లోనే రూ.45 నుంచి రూ.70కు చేరిన పంచదార ధర సామాన్యుడికి భారంగా మారింది. పంట తగ్గుదల, డిమాండ్, నిల్వలు, అంతర్జాతీయ ధరల ప్రభావంతో ధరలు పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. కిలోకు రూ.25 పెంపు.. ధరలకు బ్రేకులు ఎప్పుడు?
25 Aug, 03:31 AM
25 Aug, 03:09 AM
భారత్‌తో టీ20 సిరీస్‌కు అఫ్గాన్ జట్టు ఇదే..
IND vs AFG : భారత్ వేదికగా అఫ్గానిస్థాన్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. టీమ్ఇండియాతో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. అంతేకాదండోయ్.. ముగ్గురు ఆటగాళ్లను రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకున్నారు.
25 Aug, 02:54 AM
ఏపీకి వెదర్ అలర్ట్.. దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
అమరావతి వాతావరణ కేంద్రం లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. ఆగస్టు 24 నుంచి రానున్న రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్–యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. వర్షాలే కాదు.. మెరుపులు, ఉరుములు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అల్పపీడన ప్రభావంతో చక్రవాత ఆవర్తనం ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మరింత చురుగ్గా మారిపోతున్నాయి.
25 Aug, 02:02 AM
తెలుగు న్యూస్ టెస్ట్
ఇది తెలుగు encoding పరీక్ష కోసం మాత్రమే.
24 Aug, 11:51 PM
24 Aug, 11:44 PM