శ్రీ రామా యోగి స్వామీ తిరుణాళలో పాల్గొన్న టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్
కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో శ్రీ రామా యోగి స్వామీ తిరుణాళ సందర్భంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ప్రసంగించి, స్వామి కృపతో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, జనసేన నాయకులు వరికూటి నాగరాజు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, పొట్లపాడు గ్రామ టిడిపి నాయకులు, టిడిపి–జనసేన–బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.