దర్శి ఆర్టీసీ డిపో స్థల కేటాయింపుపై కలెక్టర్‌తో చర్చించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలులోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలో ఆర్టీసీ డిపో అవసరం ఉందని వివరించి, డిపో నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.
దీనిపై కలెక్టర్ రాజబాబు గారు సానుకూలంగా స్పందించి, స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలిసి డిపోకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.