Select Location
Newsread Image

No.1 Short News

Newsread
మత విద్వేషాలకు చోటు లేదు: ఫారూఖ్ షుబ్లి
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మత విద్వేషాలకు చోటు లేదని ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లి అన్నారు. మేడారం జాతర సందర్భంగా వేధింపులకు గురైన కోవా బన్ విక్రేత వలీకి యావత్ హిందూ సమాజం అండగా నిలవడం మత సామరస్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో మత సామరస్య వాతావరణం కొనసాగుతోందని, కోవా బన్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వలీ & అతని మిత్ర బృందానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందజేశారు.
View More
Latest News
15 Feb 2026 19:22 PM
0
39
Newsread Image

No.1 Short News

Newsread
మేడారం కోవా బన్ వివాదం: పేద వ్యాపారి వలీకి అండగా మంత్రి నారా లోకేష్
మేడారం జాతరలో చోటుచేసుకున్న కోవా బన్ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ ఘటనలో విమర్శలు ఎదుర్కొన్న పేద వ్యాపారి వలీకి అండగా నిలుస్తూ, ఆయనకు ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాలో స్పందించిన నారా లోకేష్ – డియర్ బ్రదర్ వలీ, నీవు ఎదుర్కొన్న పరిస్థితికి నేను చాలా బాధపడ్డాను. ఇలాంటి విభజన రాజకీయాలకు, మతపరమైన వేధింపులకు మన తెలుగు సమాజంలో చోటు లేదు. త్వరలోనే నేను నిన్ను కలుస్తాను. నీ ఫేమస్ కోవా బన్ రుచి చూడాలని ఎదురుచూస్తున్నాను. మనమందరం కలిసి నిలబడదాం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో వలీకి మద్దతుగా పలువురు సోషల్ మీడియాలో ముందుకు వస్తున్నారు. సాధారణ జీవనం సాగించే చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి అవమానించే ప్రయత్నాలు సమాజంలో ప్రమాదకర సంకేతాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చర్చ మొదలైంది.
View More
Latest News
15 Feb 2026 16:10 PM
1
36
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లు టీడీపీ కార్యకర్త షేక్ బాజీ మృతి పట్ల నారాపుశెట్టి పాపారావు సంతాపం
దర్శి / ఉల్లగల్లు: దర్శి నియోజకవర్గంలోని ఉల్లగల్లు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ ముస్లిం యువ కార్యకర్త షేక్ బాజీ (యువ కిరణం) అకాల మరణం పట్ల దర్శి మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు తీవ్ర సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. షేక్ బాజీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ, పార్టీ కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని పాపారావు పేర్కొన్నారు. ముఖ్యంగా ముస్లిం యువతను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తను కోల్పోవడం పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఈ సందర్భంగా నారాపుశెట్టి పాపారావు మాట్లాడుతూ, “షేక్ బాజీ అకాల మరణం ఎంతో బాధాకరం. ఆయన పార్టీకి చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు ఈ కష్టం నుంచి బయటపడేందుకు పార్టీ తరపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతునికి నివాళులర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
View More
Latest News
08 Feb 2026 15:06 PM
2
64
Newsread Image

No.1 Short News

Newsread
రోడ్డుప్రమాదంలో గాయపడిన యువకుడికి మానవత సంస్థ ఆర్థిక సహాయం
దర్శి, ప్రకాశం జిల్లా: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు, కాలికి శస్త్రచికిత్సలు చేయించుకుని ప్రస్తుతం మంచానికే పరిమితమై, గతంలో భార్యను కోల్పోయి ఇద్దరు చిన్న పిల్లలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో జీవిస్తున్న ముండ్లమూరు మండలం పులిపాడు సమీపంలోని బంగారమ్మగుట్ట గ్రామానికి చెందిన రాచగొర్ల రాజయ్య అనే యువకుని దీనస్థితి మానవత స్వచ్ఛంద సేవాసంస్థకు తెలియడంతో, సంస్థ సభ్యులు మానవతతో ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఈ రోజు దరశి మానవత స్వచ్ఛంద సేవాసంస్థ చైర్మన్ దేవతి వరప్రసాదు, ప్రకాశం జిల్లా మానవత సంస్థ ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులు చీదెళ్ళ బసవయ్య, అత్యవసర విభాగం డైరెక్టర్ రోశారావు, సభ్యులు నారాయణ తదితరులు బంగారమ్మగుట్ట గ్రామంలోని బాధితుని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. బాధితుడికి మనోధైర్యం నింపుతూ సంస్థ తరఫున ₹5,000/- నగదును అందజేసి ఆత్మీయ సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ మానవత సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ మహోన్నత ఆశయాలతో, విలువలతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 141 కేంద్రాల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా, రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా నిస్వార్థంగా సేవలందిస్తున్న మానవతామూర్తులు ఈ సంస్థలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకొని, సంస్థ అభివృద్ధికి భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
View More
Latest News
07 Feb 2026 16:38 PM
2
50
Newsread Image

No.1 Short News

Newsread
తిరుమలలో దేవుని ముందు లక్కీ డ్రా రీల్స్.. యువకులు అరెస్ట్
తిరుమల ఆలయం ముందు “లక్కీ డ్రాలో బీఎండబ్ల్యూ కారు గెలుచుకోండి” అంటూ ఇద్దరు యువకులు రీల్ వీడియో చేశారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. గోలి 4 అనిల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడిని కారుతో సహా తిరుమలకు తీసుకొచ్చారు. మరో వ్యక్తి నరేంద్ర ఇప్పటికే హైదరాబాద్ జైలులో ఉన్నాడు. పవిత్ర స్థలాల్లో ఇలాంటి రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు
View More
Latest News
07 Feb 2026 08:35 AM
0
28
Newsread Image

No.1 Short News

Newsread
బిసివై దర్శి యూత్ కన్వీనర్‌గా వెంకట యాదవ్ నియామకం
దర్శి : భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ యూత్ కన్వీనర్‌గా తెలుకుట్ల వెంకట యాదవ్ను నియమించారు. క్షేత్రస్థాయిలో వెంకట యాదవ్‌కు ఉన్న పట్టు, యువతలో ఆయనకు ఉన్న ఆదరణను గుర్తించిన పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ ఈ బాధ్యతను అప్పగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నియామకంపై వెంకట యాదవ్ హర్షం వ్యక్తం చేస్తూ, నియోజకవర్గంలో యువతను చైతన్యవంతం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
View More
Latest News
01 Feb 2026 19:31 PM
0
61
Newsread Image

No.1 Short News

Newsread
వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టిడిపి నేత కడియాల వెంకటేశ్వరరావు
గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి కార్యకర్తను అరెస్టు చేయించిన ఘటనను గుర్తు చేసిన టిడిపి డాక్టర్స్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు, నేడు అదే తరహా వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై జరిగితే, అంబటి రాంబాబును పరామర్శించడమే సరైనదా? అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో ద్వంద్వ వైఖరి ఎందుకు పాటిస్తున్నారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఇదేనా మీ రాజకీయ సంస్కారం? ఇదేనా మీ రాజకీయ విధానం? అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి కడియాల వెంకటేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
View More
Latest News
31 Jan 2026 22:23 PM
1
45
Newsread Image

No.1 Short News

BSR NEWS
తలసీమియా బాధితుల కోసం గుంటూరులో బృహత్‌ రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
పాత గుంటూరులో క్యాంపెయిన్షిప్ సంస్థ ఆధ్వర్యంలో తలసీమియా బాధితులకు సహాయంగా నిర్వహించనున్న రక్తదాన శిబిరం పోస్టర్‌ను సోమవారం ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి & తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపెయిన్షిప్ సభ్యులు వసీం అలీ చౌదరి, మునీర్, ఖాజా, నజీముద్దీన్, జహీర్ పాల్గొన్నారు. అలాగే వైసీపీ నాయకులు మున్వర్ హాజరై రాబోయే రక్తదాన శిబిరానికి తమ పూర్తి మద్దతు తెలిపారు.
View More
24 Jan 2026 01:41 AM
4
60
Newsread Image

No.1 Short News

Newsread
రెడ్డి నగర్–బసాపురం రోడ్డుకు నిధులు: పవన్ కళ్యాణ్ వేగమే ప్రత్యేకం
రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1.90 కోట్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి టిడిపి ఇంచార్జ్ Dr. గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కోరిన వెంటనే నిధులు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడని, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు–పవన్–లోకేష్ కలిసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని Dr. లక్ష్మీ అన్నారు. దర్శి నియోజకవర్గంలో 19 నెలల్లో దాదాపు రూ.200 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు. తరువాత లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసిన Dr. లక్ష్మీ. కార్యక్రమంలో టిడిపి–జనసేన–బిజెపి నాయకులు పాల్గొన్నారు.
View More
Latest News
23 Jan 2026 22:44 PM
1
39
Newsread Image

No.1 Short News

Newsread
గంటల్లోనే రోడ్డు నిర్మాణం—పవన్ కళ్యాణ్ కే సాధ్యం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ముండ్లమూరు మండలంలోని రెడ్డి నగర్ నుంచి బసాపురం వరకు రోడ్డు నిర్మాణానికి గౌరవ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ రూ.1 కోటి 90 లక్షలు మంజూరు చేసి దర్శి ప్రజలకు సంక్రాంతి కానుక అందించారని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
View More
23 Jan 2026 20:51 PM
1
32
Newsread Image

No.1 Short News

BSR NEWS
మాట నిలబెట్టిన కూటమి – తూర్పు వీరాయపాలెంలో అభివృద్ధికి 3 కోట్లు!
దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ. 3 కోట్లు వ్యయంతో టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టిందని ఆమె పేర్కొన్నారు. లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
View More
23 Jan 2026 20:48 PM
0
26
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లులో డ్వాక్రా సంఘాలకు భారీ రుణాల పంపిణీ
ఉల్లగల్లులో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మొత్తం 274 డ్వాక్రా మహిళా సంఘాలకు ₹27 కోట్లు రుణాన్ని ప్రభుత్వం తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళా శక్తికరణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మహిళలు స్వయం సంస్కరణలో, చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో, కుటుంబ ఆర్థిక స్థితి బలోపేతం చేసుకోవడంలో ఈ రుణాలు కీలకంగా ఉపయోగపడతాయని కార్యక్రమంలో స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై ధన్యవాదాలు తెలిపారు.
View More
Latest News
17 Jan 2026 16:00 PM
1
63
Newsread Image

No.1 Short News

Newsread
రేపు దర్శి‌లో భారీగా అభివృద్ధి శంఖారావం
దర్శి, జనవరి 17: దర్శి నియోజకవర్గంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారు. ఉదయం 10.30కి దర్శిలో రూ.4 కోట్లతో కొత్త విద్యుత్ డివిజనల్ కార్యాలయానికి భూమిపూజ, 11.15కి ఉల్లగల్లు లో రూ.3.90 కోట్లతో 33/11 కేవి సబ్‌స్టేషన్ శంఖుస్థాపన జరుగుతుంది. 11.45కి కీ.శే. నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ, 12 గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 2గంటలకు పసుపుగళ్లలో బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. మీడియా సోదరులు కార్యక్రమాలను విస్తృతంగా కవర్ చేయాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కోరారు.
View More
Latest News
16 Jan 2026 15:44 PM
0
53
Newsread Image

No.1 Short News

Newsread
భోగి మంటల సాక్షిగా సంక్షేమ మార్గంలో మా ప్రయాణం Dr. గొట్టిపాటి లక్ష్మి
భోగి మంటల సాక్షిగా ప్రజా సంక్షేమమే మా సంకల్పం. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ప్రతి కుటుంబానికి ఆనందం పంచే భోగి కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు.
View More
14 Jan 2026 06:30 AM
0
51
Newsread Image

No.1 Short News

Newsread
ఉల్లగల్లో మహిళా శక్తికి కొత్త అధ్యాయం – జన్ శిక్షణ సేవా సంస్థాన్ టైలరింగ్ కోర్స్ ముగింపు
ఉల్లగల్లు, ప్రకాశం జిల్లా: జన్ శిక్షణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో గత మూడు నెలలుగా నిర్వహించిన టైలరింగ్ కోర్సు ఈరోజుతో విజయవంతంగా పూర్తైంది. ఈ కోర్సులో పాల్గొన్న 20 మంది మహిళలు టైలరింగ్ నైపుణ్యాలను అభ్యసించి, స్వయం ఉపాధికి దారి తెరిచారు. ట్రైనర్ ప్రసన్న మాట్లాడుతూ, “ఈ కోర్సు ద్వారా మహిళలు స్వంతంగా ఉపాధి పొందే సామర్థ్యం పెరిగింది. ఇంటి వద్దే టైలరింగ్ ప్రారంభించవచ్చు, చిన్న స్థాయిలో బొటిక్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టొచ్చు” అని తెలిపారు. కార్యక్రమ ముగింపు సందర్భంగా ట్రైనర్ ప్రసన్నకు ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక మహిళలు, సంస్థ ప్రతినిధులు సునీల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉల్లగల్లు కు తీసుకువచ్చేందుకు కృషి చేసిన భూలక్ష్మిని కూడా మహిళలు ప్రశంసిస్తూ సన్మానించారు.
View More
Latest News
09 Jan 2026 14:12 PM
2
81
Newsread Image

No.1 Short News

Newsread
ప్రకాశం జిల్లా – దర్శిలో కార్డన్ & సెర్చ్, 67 బైక్‌లు స్వాధీనం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణ శివారులోని శివరాజ్ నగర్ ప్రాంతంలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల నిరోధం కోసం పోలీసులు అకస్మికంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. మార్కాపురం జిల్లా ఇంచార్జి ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, దర్శి డిఎస్పి బి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. సీఐలు, ఎస్సైలు సహా 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. తరువాత “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో ర్యాలీ నిర్వహించి, యువత, ప్రజలకు మత్తుపదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. గంజాయి–డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
View More
Latest News
08 Jan 2026 14:22 PM
0
53
Newsread Image

No.1 Short News

Newsread
గంగవరంలో నాగూర్ మీరావలి దర్గా గంధ మహోత్సవం రేపే..
తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలోని 200 ఏళ్ల చరిత్ర గల నాగూర్ మీరావలి దర్గా వద్ద గంధ మహోత్సవం రేపు భక్తి పూర్వకంగా జరగనుంది. గత సంవత్సరం పునఃప్రారంభించిన ఈ వేడుక ఈ ఏడాది రెండవ గంధ మహోత్సవంగా జరుగుతోంది. పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు, ప్రముఖులు హాజరుకానున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 10 గంటలకు 10,000 మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
View More
Latest News
08 Jan 2026 11:21 AM
0
56
Newsread Image

No.1 Short News

Newsread
శ్రీ రామా యోగి స్వామీ తిరుణాళలో పాల్గొన్న టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్
కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో శ్రీ రామా యోగి స్వామీ తిరుణాళ సందర్భంగా సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం టిడిపి నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై ప్రసంగించి, స్వామి కృపతో ప్రజలందరికీ శాంతి, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, జనసేన నాయకులు వరికూటి నాగరాజు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, పొట్లపాడు గ్రామ టిడిపి నాయకులు, టిడిపి–జనసేన–బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
View More
06 Jan 2026 08:46 AM
1
49
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలు ప్రకాశం భవనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతన లిఫ్ట్ ప్రారంభం
ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ను జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజ బాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దర్శి టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్యంగా హాజరయ్యారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామచర్ల జనార్దన్, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ విజయ్ కుమార్, టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్, యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్సన్ బాబు తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు మరియు మహిళలకు సౌకర్యంగా ఉండేలా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఇది ఒక కీలక ముందడుగు అని నాయకులు పేర్కొన్నారు.
View More
04 Jan 2026 06:03 AM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
ఐటీ పార్క్ పేరుతో వక్ఫ్ భూములు ప్రైవేటుకు అప్పగిస్తే సహించం
అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన వక్ఫ్ భూములను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరిఫాతిమా, తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1915 సంవత్సరంలో చిన్న కాకాని గ్రామంలో సర్వే నంబర్లు 187/1, 201/A,B, 201/2B, 202/B, 203/A,B, 204/A,C&D, 222/2A & 2Bలలో ఉన్న మొత్తం 81.23 ఎకరాల భూమిని ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం దాతలు అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు అందజేశారని వారు గుర్తు చేశారు. ఈ భూమిని కేవలం ముస్లింల స్కిల్ డెవలప్‌మెంట్, లైబ్రరీ, ముస్లిం పిల్లలకు స్కాలర్‌షిప్‌లు, విద్యాసంస్థల ఏర్పాటు కోసమే వినియోగించాలని దాతలు స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిపారు. అయితే వక్ఫ్‌బోర్డు ద్వారా ఈ భూమిలోని 71.57 ఎకరాలను ఐటీ పార్క్ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని విమర్శించారు. వక్ఫ్‌బోర్డు కమిటీకి కేవలం మూడు సంవత్సరాల పాటు మాత్రమే లీజుకు ఇచ్చే అధికారం ఉండగా, 30–40 సంవత్సరాల లీజుల ప్రతిపాదనలు ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా టెండర్ల ప్రకటనలు చేయడం కూడా చట్టవిరుద్ధమని, ఇది ముస్లిం సమాజాన్ని మరింత వెనుకబాటుకు నెట్టే చర్యగా అభివర్ణించారు. వక్ఫ్ భూముల విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన వక్ఫ్‌బోర్డు సీఈఓపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌పై చర్యలు తీసుకుని వక్ఫ్ ఆస్తులను కాపాడాలని కోరారు. చిన్న కాకాని అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన 81.23 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యోచనను విరమించుకోని పక్షంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి, ముస్లిం సంఘాలతో కలిసి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని వారు హెచ్చరించారు.
View More
23 Dec 2025 16:59 PM
5
124
Newsread Image

No.1 Short News

Newsread
పోలియో చుక్కలతోనే పోలియో నిర్మూలన సాధ్యం:కపురం శ్రీనివాసరెడ్డి
అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయిస్తే పోలియోను పూర్తిగా నిర్మూలించవచ్చని ఐఆర్సీయస్ ఎగ్జిక్యూటివ్ మెంబరు కపురం శ్రీనివాసరెడ్డి అన్నారు. దరిశి గడియార స్తంభం సెంటర్‌లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో 11 నెలల చిన్నారికి పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు.
View More
Latest News
21 Dec 2025 16:42 PM
1
60
Newsread Image

No.1 Short News

Newsread
ఒంగోలులో గంజాయి కట్టడి: రైలులో 7 కిలోల గంజాయి స్వాధీనం
ఒంగోలు: గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్‌తో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., పర్యవేక్షణలో జరిగిన తనిఖీల్లో అలప్పుజా ఎక్స్‌ప్రెస్‌లో సుమారు 7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
View More
Latest News
21 Dec 2025 15:32 PM
2
54
Newsread Image

No.1 Short News

Vijaya Chandra
ఈరోజు బి. మఠం ఎంపీడీఓను కలిసిన టీడీపీ నాయకులు కానాల మల్లి కార్జున రెడ్డి
ఈరోజు ఎంపీడీవోరామచంద్రారెడ్డి ని మండల తెదేపా నాయకుడు *కానాల* *మల్లికార్జునరెడ్డి* మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలను ఎంపీడీవో దృష్టికి తెచ్చారు.
View More
Latest News
20 Dec 2025 22:18 PM
2
70
Newsread Image

No.1 Short News

Newsread
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షూబ్లిని సత్కరించిన సయ్యద్ మెహతాజ్ బేగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా నియమితులైన జనాబ్ ఫారూక్ షూబ్లి గారిని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి సయ్యద్ మెహతాజ్ బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉర్దూ భాషాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ఉర్దూ భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణలో ఆయన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో ఉర్దూ భాషకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
View More
Latest News
20 Dec 2025 21:11 PM
1
38
Newsread Image

No.1 Short News

Newsread
దర్శిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ – డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి నియోజకవర్గంలో 135 మంది లబ్ధిదారులకు రూ.82,36,297 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ శనివారం తన నివాసం వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్యతో పాటు పార్టీ నేతలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
View More
Latest News
20 Dec 2025 17:53 PM
2
66
Newsread Image

No.1 Short News

Newsread
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్‌గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
View More
Latest News
20 Dec 2025 17:13 PM
1
41
Newsread Image

No.1 Short News

Newsread
అంగన్వాడీలకు 5G ఫోన్లు – మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత బలోపేతం చేస్తూ కీలక అడుగు వేసింది. దర్శి నియోజకవర్గంలోని 334 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 15 మంది సూపర్వైజర్లకు కలిపి మొత్తం 344 మందికి 5G ఫోన్లను దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, శిశు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన ద్వేయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో సాంకేతికతను వినియోగిస్తూ అంగన్వాడీలను బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అందించే పోషకాహారం ప్రతి శిశువుకు చేరేలా అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని, గర్భిణీ స్త్రీలు, మహిళల ఆరోగ్య పరిరక్షణలో ముందుండాలని ఆమె పిలుపునిచ్చారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యల కోసం ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని, ఒక డాక్టర్‌గా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.
View More
20 Dec 2025 16:19 PM
1
61
Newsread Image

No.1 Short News

Newsread
పోలియో రహిత భవిష్యత్తే లక్ష్యం – జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు
ఈ రోజు ఉదయం పొన్నలూరు మండలం, పొన్నలూరు గ్రామంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు పోలియో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతిసారి రెండు చుక్కలు వేయడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. డిసెంబర్ 21, 2025 నుంచి పోలియో కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. 0–5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
View More
20 Dec 2025 16:15 PM
1
38
Newsread Image

No.1 Short News

Newsread
స్వచ్ఛతతోనే స్వర్ణాంధ్ర సాధ్యం – మంత్రి డోలా పిలుపు
కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండల కేంద్రంలో నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి , జిల్లా కలెక్టర్ పి. రాజా బాబు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని వారు పేర్కొంటూ ప్రజలు స్వచ్ఛత పాటించాలని పిలుపునిచ్చారు.
View More
20 Dec 2025 12:14 PM
1
32
Newsread Image

No.1 Short News

Newsread
ప్రాణాలే ప్రథమ లక్ష్యం: నిద్ర మత్తుపై ప్రకాశం పోలీసుల ప్రత్యేక కార్యక్రమం
రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు అర్థరాత్రి వేళ ప్రత్యేక ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జాతీయ మరియు రాష్ట్ర రహదారులపై రాత్రి 1 గంట నుంచి ఉదయం 4:30 గంటల వరకు ఈ కార్యక్రమం చేపట్టారు. హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపివేసి, డ్రైవర్లు నిద్ర మత్తు దూరం చేసుకోవడానికి ముఖం కడుక్కోవడం, టీ తాగడం ద్వారా అప్రమత్తంగా ప్రయాణం కొనసాగించాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ భద్రతను గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనం నడపాలని అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత కోసం ఇలాంటి ప్రజా భద్రతా కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.
View More
20 Dec 2025 11:36 AM
2
60
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి ఆర్టీసీ డిపో స్థల కేటాయింపుపై కలెక్టర్‌తో చర్చించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
ఒంగోలులోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ జిల్లా కలెక్టర్ పి. రాజబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శిలో ఆర్టీసీ డిపో అవసరం ఉందని వివరించి, డిపో నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై కలెక్టర్ రాజబాబు గారు సానుకూలంగా స్పందించి, స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలిసి డిపోకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తిస్తామని హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
View More
19 Dec 2025 20:07 PM
1
53
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి సర్కిల్‌లో రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్
ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు చెందిన రౌడీషీటర్లు మరియు సస్పెక్ట్ షీటర్లకు దర్శి సర్కిల్ ఆఫీస్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దర్శి సిఐ వై. రామారావు ఆధ్వర్యంలో ముండ్లమూరు ఎస్సై కె. కమలాకర్, తాళ్లూరు ఎస్ఐ మల్లికార్జున్ కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, అందరూ సత్ప్రవర్తనతో ఉండాలని, నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇప్పటికే ఆరు నెలల బైండోవర్‌లో ఉన్నప్పటికీ ఎవరైనా నేరాల్లో పాల్గొంటే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
View More
Latest News
17 Dec 2025 20:44 PM
0
34
Newsread Image

No.1 Short News

Newsread
చాకచక్యంగా దొంగతనం కేసు ఛేదన – నిందితుల అరెస్ట్, భారీ రికవరీ
ఒంగోలు పట్టణంలోని బృందావనం కళ్యాణ మండపంలో జరిగిన దొంగతనం కేసును ప్రకాశం జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా స్వల్ప వ్యవధిలో ఛేదించారు. ఈ కేసులో సుమారు రూ.20.20 లక్షల విలువైన బంగారు నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. 2025 నవంబర్ 27న పెళ్లి వేడుకల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు 158 గ్రాముల బంగారు నగలు, నగదుతో ఉన్న బ్యాగ్‌ను దొంగిలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఒంగోలు డీఎస్పీ ఆర్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, తాలూకా సీఐ టి. విజయ కృష్ణ నేతృత్వంలో పోలీసులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌ఘర్ జిల్లా సాన్సి నివాసి గ్రామానికి వెళ్లి ఇద్దరు నిందితులు మరియు ఇద్దరు బాల నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారు నగలు, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు.
View More
Latest News
17 Dec 2025 17:18 PM
2
41
Newsread Image

No.1 Short News

Newsread
సీనియర్ టీడీపీ నాయకుడు బోడపాటి చంద్రమౌళి పరామర్శించిన డా. గొట్టిపాటి లక్ష్మీ
మండల కేంద్రమైన ముండ్లమూరు కు చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కో-ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ బోడపాటి చంద్రమౌళిని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకుంటున్న చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.
View More
17 Dec 2025 17:16 PM
0
52
Newsread Image

No.1 Short News

Newsread
నితీష్ కుమార్ చర్యలకు నిరసనగా ఒంగోలులో ఎస్‌డీపీఐ ఆందోళన
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివాదాస్పద చర్యలకు వ్యతిరేకంగా సోషియల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఆధ్వర్యంలో ఒంగోలు గుంటూరు రోడ్డులోని పోతురాజు కాలువ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, ఆయుష్ విద్యార్థికి పత్రాలు అందజేస్తూ మహిళా డాక్టర్ మాస్క్‌ను లాగడం అనుచితమని విమర్శించారు. ప్రజాప్రతినిధుల విలువలు దిగజారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, నితీష్ కుమార్ ముస్లింలకు క్షమాపణ చెప్పాలని లేదా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖాజావలి, ఖాసిం, లతీఫ్, నసీమ, షాహీన తదితరులు పాల్గొన్నారు.
View More
Latest News
16 Dec 2025 21:17 PM
1
33
Newsread Image

No.1 Short News

Newsread
విద్యుత్ పొదుపుతోనే భవిష్యత్తు భద్రం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలో నిర్వహించిన పవర్ సేవింగ్ అవగాహన ర్యాలీలో టిడిపి దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొని, అవసరానికి మించి విద్యుత్ వినియోగం భవిష్యత్తును అంధకారంగా మారుస్తుందని హెచ్చరించారు. సహజ వనరులు, ఇంధనం, విద్యుత్ పొదుపుపై ప్రజల్లో అవగాహన అవసరమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యమైందని తెలిపారు. ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుతూ సోలార్ విద్యుత్ వైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
View More
Latest News
16 Dec 2025 14:07 PM
1
34
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో వైసీపీ భారీ ర్యాలీ
వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి, సేకరించిన సంతకాలను తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలించారు.
View More
Latest News
15 Dec 2025 19:50 PM
2
37
Newsread Image

No.1 Short News

Newsread
కోటి సంతకాల పత్రాల తరలింపులో భాగంగా ఒంగోలులో వైసీసీపీ ర్యాలీ
కోటి సంతకాల సేకరణ పత్రాలను తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ , యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. అలాగే ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రాహ్మణంద రెడ్డి , మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ , మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు , కె. నాగార్జున రెడ్డి ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి , కనిగిరి ఇంచార్జ్ దద్దాల నారాయణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
View More
Latest News
15 Dec 2025 18:42 PM
1
51
Newsread Image

No.1 Short News

Newsread
డా. గొట్టిపాటి లక్ష్మీని కలిసిన గ్రంథాలయం చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి
నరసరావుపేట: నేడు నరసరావుపేటలోని డా. గొట్టిపాటి లక్ష్మీ నివాసం వద్ద దర్శి టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ని ప్రకాశం జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుచిత్ర ని శాలువాతో సత్కరించి, గ్రంథాలయం చైర్మన్‌గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
View More
Latest News
15 Dec 2025 13:41 PM
0
38
Newsread Image

No.1 Short News

Newsread
5 తరాలకు సలహాలు ఇస్తున్న శతాధిక వృద్ధురాలు వెంకట సుబ్బమ్మ
దొనకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు గొంగటి వెంకట సుబ్బమ్మను కపురం శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెతో కొంతసేపు ముచ్చటించి, వారి దీర్ఘాయుష్షుకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ, పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం, సహజ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమే తన ఆరోగ్యానికి ప్రధాన కారణమని తెలిపారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి కూడా తనపై ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. పట్టణ జీవనశైలి, మానసిక ఒత్తిళ్లు, అనారోగ్యకర ఆహార అలవాట్ల వల్ల యువత చిన్న వయసులోనే అనారోగ్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 మంది రక్తసంబంధీకులతో, ఐదు తరాల మనవళ్లు–మునిమనవరాళ్లతో కలిసి జీవించడం దేవుడిచ్చిన వరమని, ఈ వయసులోనూ సరదాగా, సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా కపురం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, వెంకట సుబ్బమ్మ జీవన విధానం నేటి తరాలకు గొప్ప ఆదర్శమని పేర్కొన్నారు. పల్లె జీవన విలువలు, ఆరోగ్యకరమైన అలవాట్లపై యువత దృష్టి పెట్టాలని సూచించారు.
View More
Latest News
15 Dec 2025 11:26 AM
1
37
Newsread Image

No.1 Short News

Newsread
టిడిపి సీనియర్ నాయకుడు కాశయ్య మృతి | గొట్టిపాటి లక్ష్మి పరామర్శ
దొనకొండ మండలం రుద్రసముద్రం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు, తర్లుపాడు సమితి ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచ్ దుగ్గంపూడి ఎర్ర కాశయ్యా గారి మృతి పట్ల దర్శి టిడిపి ఇంచార్జి డా. గొట్టిపాటి లక్ష్మీ, టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాశయ్యా గారి పార్ధివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.
View More
14 Dec 2025 20:33 PM
1
54
Newsread Image

No.1 Short News

Newsread
విద్యార్థుల ప్రతిభ వికాసానికి హ్యాపీ సండే కార్యక్రమం : డా. గొట్టిపాటి లక్ష్మీ
దర్శి పట్టణంలోని ఎల్పీ రోడ్ గర్ల్స్ బీసీ హాస్టల్‌లో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ, విద్యార్థులు ఆదివారం రోజున ఆనందంగా ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడపాలని, మిగిలిన ఆరు రోజులు చదువుపై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. చదువు ద్వారానే జీవితానికి సరైన దిశ లభిస్తుందని, కుటుంబాభివృద్ధితో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుందని అన్నారు. విద్యార్థి దశలోనే చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలు వంటి నైపుణ్యాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ–విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సరికొత్త విద్యా విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పాఠశాలలో కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టి, పరిశుభ్రతతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించడమే హ్యాపీ సండే కార్యక్రమ లక్ష్యమని వివరించారు. గతంలో కూడా బీసీ హాస్టల్‌ను సందర్శించానని, విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా వార్డెన్‌కు తెలియజేయవచ్చని చెప్పారు. బాత్రూంల శుభ్రత, మంచినీరు, ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల తహసీల్దార్ శ్రవణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్లు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు కుమార్తె మన్విత శివ సాయి పుట్టినరోజు సందర్భంగా హాస్టల్‌లోని విద్యార్థినులందరికీ స్వెటర్లు పంపిణీ చేశారు.
View More
14 Dec 2025 19:08 PM
1
35
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజాసేవే రాజకీయం అని నిరూపించిన మహానేత వంగవీటి రంగా: డా. గొట్టిపాటి లక్ష్మీ
పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చివరి శ్వాస వరకు పనిచేసిన స్వర్గీయ వంగవీటి రంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత అని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. ఆదివారం దర్శిలో జరిగిన శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా, కనకం వెంకయ్య గార్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంగా కులాలకు అతీతంగా పేదల నాయకుడని, ప్రజాసేవే ఆయన రాజకీయ ధ్యేయమని డా. గొట్టిపాటి లక్ష్మీ కొనియాడారు. రంగా ఆశయాలే తన రాజకీయ స్ఫూర్తి అని పేర్కొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ, కూటమి ప్రభుత్వంలో దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రాధా , టిడిపి, జనసేన నాయకులు, కూటమి శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
View More
14 Dec 2025 18:43 PM
1
25
Newsread Image

No.1 Short News

Newsread
దర్శి టౌన్ లో రోడ్ సేఫ్టీ అవగాహన
దర్శి టౌన్‌లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సిఐ వై. రామారావు, ఎస్ఐ మురళి మరియు రోడ్ సేఫ్టీ వారియర్స్ కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పొదిలి రోడ్డులోని షాపుల వద్ద, వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అనే సందేశం ఇచ్చారు. షాపుల్లో హెల్మెట్ అవగాహన స్టిక్కర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని వ్యాపారులకు సూచించారు. హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న కొంతమందిని గుర్తించి వారికి సిఐ రామారావు స్వయంగా అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సిఐ రామారావు మాట్లాడుతూ, మంచు కాలంలో ప్రమాదాలు ఎక్కువ. అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, రోడ్డు భద్రత పాటించాలి అన్నారు.
View More
Latest News
12 Dec 2025 19:38 PM
3
70
Newsread Image

No.1 Short News

Newsread
మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన గులాం రసూల్
ఈ రోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్ రెడ్డిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి–పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిస్థితులు, పార్టీ బలపరిచే కార్యక్రమాలు, శ్రేణుల సమస్యలు, కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచే చర్యలు వంటి కీలక అంశాలపై గులాం రసూల్ జగన్తో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి తాను మరింత కృషి చేస్తానని గులాం రసూల్ హామీ ఇచ్చారు. పారదర్శక రాజకీయాలు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగాలి అన్న ముఖ్య సందేశాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించినట్లు సమాచారం.
View More
11 Dec 2025 20:29 PM
1
38
Newsread Image

No.1 Short News

Newsread
ప్రజల కోసం పోరాడే నాయకత్వం. డా||లక్ష్మీ పట్టుదలకి ప్రభుత్వ స్పందన
దర్శి నియోజకవర్గంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి అనేది డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లక్ష్యం. ప్రజల సమస్యలను తమ సమస్యగా తీసుకుని పని చేసే అసలైన నాయకత్వం మళ్లీ నిరూపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు చివరకు శాశ్వత పరిష్కారం వచ్చింది. గ్రామాల మధ్య రోడ్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన డాక్టర్ లక్ష్మీ —ఈ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరించారు. పల్లె పండుగ 2.0 లో భాగంగా ప్రభుత్వం వెంటనే స్పందించి 10.17 కోట్ల రూపాయలతో 20.92 KM రోడ్లు దర్శికి మంజూరు చేసింది. ఆమోదం పొందిన ప్రధాన రహదారులు: 1️⃣ మారెళ్ల – నూజళ్లపల్లి – బట్లపల్లి : ₹4.14 కోట్లు 2️⃣ పెద్ద ఉల్లగల్లు – సింగన్నపాలెం : ₹4.05 కోట్లు 3️⃣ దొనకొండ – గజ్జలకొండ వయా ఇండ్లచెరువు : ₹1.98 కోట్లు ఈ రోడ్లు పూర్తయితే దర్శి ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది, కనెక్టివిటీ పెరుగుతుంది, రైతులు–విద్యార్థులు–రోగులు ఇక మట్టిబాటల ఇబ్బందులు పడాల్సిన పని ఉండదు. దర్శి అభివృద్ధిలో ఇది ఒక పెద్ద ముందడుగు.
View More
Latest News
10 Dec 2025 09:11 AM
1
52
Newsread Image

No.1 Short News

Newsread
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై అరెస్ట్‌లను ఖండించిన గులాం రసూల్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేసిన రాష్ట్ర విద్యాధి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తెనాలి-పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
View More
Latest News
09 Dec 2025 18:35 PM
0
43
Newsread Image

No.1 Short News

Newsread
వైఎస్ భారతమ్మ జన్మదిన వేడుకలు – ప్రత్తిపాడు వైసీపీ కార్యాలయంలో సందడి
గుంటూరు రూరల్ ఏటుకూరు బైపాస్ వద్ద ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో, నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ జన్మదినాన్ని కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి & పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్ భారతమ్మగారికి ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
09 Dec 2025 16:19 PM
1
32
Newsread Image

No.1 Short News

Newsread
దొనకొండ : కారు ప్రమాదంలో టీడీపీ నేత కుమారుడు మృతి
బాపనపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పత్తి గురవయ్య కుమారుడు పత్తి నారాయణ స్వామి హైదరాబాద్‌లో కారు ప్రమాదంలో మృతి. యువ నేత డా. కడియాల లలిత్ సాగర్ స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
View More
Local Updates
08 Dec 2025 15:03 PM
2
52
Newsread Image

No.1 Short News

Newsread
ఫారూక్ షుబ్లీ కి వినతి పత్రం అందచేసిన మహమూద్ పీర్
కర్నూలు: కర్నూలుకు చెందిన మహమూద్ పీర్ ఈ రోజు ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయం కి విచ్చేసి, ఫరూక్ షుబ్లీ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెండు వ్యక్తులు విభిన్న విషయాలను చర్చించగా, ఫరూక్ షుబ్లీ ఈ వినతి పత్రం విషయాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారనే తెలిపారు.
View More
Latest News
08 Dec 2025 14:21 PM
0
36
View Latest Short News
😔
Oops! You're offline.
It looks like you've lost your internet connection.
Please check your network and try again.

Find News

News Categories

  • All Categories
  • Jobs (7)
  • Latest News (850)
  • Motivation (11)
  • Crime News (26)
  • Local Ads (39)
  • Entertainment (15)
  • Local Updates (220)
  • Sports News (12)
  • Education (13)
  • Business Promotions (1)
  • Politics (67)
  • Breaking News (97)
  • Install App
    ALL
    | newsread.in

    Newsread
    For better experience and daily news update.
    Download our app from play store.